తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత పాపులారిటీ సంపాదించిన గేమ్ షో బిగ్ బాస్ అని చెప్పడంలో సందేహమే లేదు. బిగ్ బాస్ మొదటి సీజన్ నుండి మూడవ సీజన్ వరకు అంతకంతకూ పాపులారిటీ పెరుగుతూనే ఉంది. టీఆర్పీ రేటింగ్స్ ని గమనిస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. అయితే బిగ్ బాస్ పాపులారిటీతో ఫేమస్ అయిన కంటెస్టెంట్స్ చాలా మందే ఉన్నారు. మొదటి సీజన్ విన్నర్ గా నిలిచిన శివబాలాజీకి బిగ్ బాస్ పాపులారిటీ ఎక్కువగా ఉపయోగపడకపోయినా రన్నరప్ గా నిలిచిన హరితేజకి మాత్రం బాగా ఉపయోగపడింది.

 

బిగ్ బాస్ కి వెళ్లకముందు కూడా హరితేజకి సినిమాల్లో అవకాశాలు బాగానే ఉన్నా, అంతగా పేరు రాలేదు. కానీ ఒక్కసారిగా బిగ్ బాస్ నుండి బయటకి వచ్చాక ఆమెకి ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో కనిపించింది. సీరియల్స్ నుండి స్టార్ట్ అయిన ఆమె జర్నీ సినిమాల్లో చాలా బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉండే హరితేజ, లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైపోయింది.

 


దాంతో ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో మాట్లాడిన హరితేజ చాలా ఆసక్తికరమైన విషయాలని వెల్లడించింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ సినిమాలో పాత్ర కోసం ఆమె సిగరెట్ తాగడం చాలా మందికి షాకింగ్ గా అనిపించింది. అయితే ఆమె నిజంగా సిగరెట్ కాల్చిందా అన్న అనుమానం అలాగే ఉండిపోయింది. ఆ విషయమై ఆమెని అడగ్గా, అవును పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి సిగరెట్ నిజంగానే కాల్చానని స్పష్టం చేసింది.

 

ఇంకా, మీ వయసెంత ఉంటుంది అని అడిగిన ప్రశ్నకి జస్ట్ ౨౮ మాత్రమే అని చెప్పి షాక్ ఇచ్చింది. మిడిల్ ఏజ్ ఉమెన్ లా కనబడే హరితేజ వయసు ౨౮ అంటే ఎవ్వరూ నమ్మరు. అలా నమ్మరని తాను ముందుగానే ఊహించినట్టుంది. నావయసెంతో చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసని, నమ్మినా నమ్మకపోయినా అదే నా వయసని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: