కాజల్ అగర్వాల్ 2007 లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమా తర్వాత నటించిన చందమామ, మగధీర సినిమాలతో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో పాపులర్ అయింది. ఇప్పటి వరకు దాదాపు టాలీవుడ్ లో హీరోలందరి సరసన నటించింది. నితిన్ లాంటి యంగ్ హీరోల దగ్గర్నుంచి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి వరకు నటించిన సినిమాలన్ని ఎక్కువగా బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నవే. చెప్పాలంటే కాజల్ అందరి సరసన మ్యాచ్ అయ్యో లక్కీ హీరోయిన్. అదే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను ఇంతకాలం వెలగడానికి ముఖ్య కారణం. 

 

ఇక మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మరోసారి చిరంజీవి సరసన నటిస్తుంది కాజల్. ఈ సినిమాలో ముందు త్రిష అనుకున్నారు. కాని ఫైనల్ గా కాజల్ ని తీసుకున్నారు. ముఖ్యంగా త్రిష ని కాదని మళ్ళీ కాజల్ ని తీసుకోవడానికి ఒక ముఖ్య కారణం గతంలో చిరంజీవి త్రిష కాంబినేషన్ లో వచ్చిన స్టాలిన్ ఫ్లాప్ గా మిగిలింది. కాని కాజల్ నటించిన ఖైదీ నంబర్ 150 సూపర్ హిట్టయింది. అదీకాక చిరంజీవి పక్కన పేయిర్ గా కాజల్ బావుంటుందన్న ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ ఫైనల్ గా కాజల్ నే ఎంచుకున్నారు. అయితే ఈ మద్య కాజల్ కూడా ఆచార్య నుండి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. కాని అవన్ని పుకార్లని స్వయంగా కాజల్ సన్నిహితులే చెబుతున్నారట.

 

ఇక తమిళంలోను కమల్ హాసన్ కి జంటగా ఇండియన్ 2 లో కాజల్ నటిస్తుంది. అక్కడ కూడా ఇదే కారణం. కమల్ హాసన్ కాజల్ ది ఫ్రెష్ కాంబినేషన్ కాబట్టి కాజల్ ని ఎంచుకున్నారు కమల్, శంకర్. ఇక తన చేతిలో మరో భారీ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఏ.ఆర్ మురగదాస్ విజయ్ కాంబినేషన్ లో తుపాకి 2 తెరకెక్కనుంది. ఈ సినిమాలో కాజల్ ని ఎంపిక చేసుకున్నారట. ఇదే కాంబినేషన్ లో తుపాకి వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే మురగదాస్ తుపాకి 2 కి కూడా కాజల్ ఉంటే కాంబో పర్‌ఫెక్ట్ గా ఉంటుందని కాజల్ ని సెలెక్ట్ చేసుకున్నారట. ఈ లెక్కన చూస్తే కాజల్ కి ప్రస్తుతం మంచి డిమాండే ఉందని అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: