తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు తన హవా నడిపించి  అందాల ఆరబోతతో ఎంతోమంది మతి పోగొట్టింది మిల్కీ బ్యూటీ తమన్నా. తెల్ల తోలు అందాలతో ఎంతోమంది అభిమానుల మతి  పోగొట్టి ... అందరికీ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే కొన్ని రోజుల తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిపించింది తమన్నా. ఆ తర్వాత ఏమైందో కానీ ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. చిన్న హీరోల సినిమాల్లో కూడా ఈ అమ్మడికి అవకాశాలు రావడం లేదు. తెలుగు తమిళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకునే బిజీ బిజీగా ఉండే ఈ అమ్మడు  అవకాశాలు లేక ఎక్కడ తెరమీద కనిపించడం లేదు. దీంతో కన్నడ మలయాళం చిత్ర పరిశ్రమపై ఈ అమ్మడు కన్నేసినట్టు తెలుస్తోంది. 

 

 

 త్వరలో కన్నడ పరిశ్రమకు కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోందట మిల్కీ బ్యూటీ తమన్నా.అయితే గతంలోనే కన్నడ  వెండితెరపై తమన్నా మెరిసింది. అయితే హీరోయిన్గా మాత్రం కాదు జాగ్వార్ కేజిఎఫ్ లాంటి చిత్రాల్లో  స్పెషల్ సాంగ్లో నర్తించింది తమన్నా.. ఈ క్రమంలోనే తమన్నాకి ఓ పాన్  ఇండియా లెవల్  మూవీలో నటించేందుకు ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అయితే కే జి ఎఫ్ తో ఎంతగానో క్రేజ్ సంపాదించిన నటుడు యష్ హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట.

 

 

దీన్ని కోసం   తమన్నా అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. మరి దీనికి మిల్కీబ్యూటీ ఒప్పుకుంటుందా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా  మారింది. అయితే కే జి ఎఫ్ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించిన యష్  హీరోగా చేస్తున్న  సినిమా లో ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్నతమన్నా  ఒప్పుకోకుండా ఉంటుంద తప్పకుండా ఒప్పుకుంటుంది అని అంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: