బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కేవలం బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ఒక ప్రత్యేకమైన ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ పెద్ద గానే కాకుండా ఒక మంచి నటుడిగా ఏకంగా చిత్రపరిశ్రమలోనే అతి గొప్ప అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న గొప్ప నటుడిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు అమితాబచ్చన్. ఎన్నో దశాబ్దాలుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ ఎంతో గుర్తింపు సంపాదించారు. కెరియర్ మొదలు నుంచి ఇప్పటి వరకు స్టార్ హీరో గానే కొనసాగుతున్నారు అమితాబచ్చన్. అమితాబచ్చన్ ఇంత వయస్సు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ తనదైన యాక్షన్ తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. 

 

 

 ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తూ తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న గొప్ప నటుడు అమితాబ్ బచ్చన్. సినీ చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ మంది నటులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటూ వుంటారు. అలాంటి గొప్ప నటుల్లో ఒకరు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. చిత్ర పరిశ్రమలో  అమితాబచ్చన్ చేసిన సేవలకు గాను ఏకంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును దక్కించుకున్నారు. అయితే కెరీర్ తొలినాళ్లలో నుంచి ఇప్పటివరకూ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించడంతో పాటు భారత  చిత్ర పరిశ్రమకు ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టారు  లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్. అటు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. 

 

 అంత గొప్ప లెజెండరీ నటుడికి కూడా అవమానాలు ఎదురయ్యాయి అంటే ఎవరైనా నమ్ముతారా.... అయితే ఆ అవమానాలు ఇప్పుడు ఎదురైనది కాదు. అమితాబ్ బచ్చన్ తన కెరియర్ మొదట్లో సినిమా అవకాశాల  కోసం తిరుగుతూ ఉన్నప్పుడు చాలామంది అమితాబ్ బచ్చన్ ను రిజెక్ట్ చేశారట.నీ  మొహం చూసుకున్నావా నీ గొంతు ఎలా ఉందో ఒక్కసారి చూసుకున్నావా అంటూ అవమానించారు. కానీ అలాంటి వ్యక్తి ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమలో ఓ గొప్ప నటుడిగా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం అలా అవమానించిన వారే అమితాబచ్చన్ గొప్పతనాన్ని తెలుసుకొని తమ తప్పును తాము తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: