సినీ ప్రపంచంలో ఎంతో మంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  కొంత మంది ప్రేమజంటలు ఇప్పటికీ కలిసి మెలిసి ఉంటే.. మరికొందరు విడాకులు ఇచ్చేశారు.   ఇప్పటికీ యువజంటలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.  ఆ మద్య అక్కినేని నాగ చైతన్య, సమంత  ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటీ నటులు రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.  ఇక బాలీవుడ్ లో అయితే.. చాలా మంది మొదట్లో డేటింగ్ చేసి తర్వాత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  బాలీవుడ్‌లో తెరపై ప్రేమ‌క‌థ‌ల క‌న్నా, తెర‌వెనుక ప్రేమ‌క‌థ‌లే అధికంగా క‌నిపిస్తాయి. ఈ కోవ‌లో అల‌నాటి హీరోహీరోయిన్లు ధర్మేంద్ర, హేమమాలినిల ప్రేమకథ క‌నిపిస్తుంది. ఇది అప్ప‌ట్లో లక్షలాది మంది దృష్టిని ఆకర్షించింది. ధర్మేంద్రకు అప్పటికే వివాహం జరిగింది.

 

ధర్మేంద్ర... ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు పిల్లలు. అయితే ఈ అంశాలు ధర్మేంద్ర, హేమ‌మాలినిల ప్రేమ‌కు అడ్డుకాలేదు.  తాజాగా హేమను వివాహం చేసుకునే ముందు ధర్మేంద్ర. ప్రకాష్ కౌర్ నుంచి‌ విడాకులు తీసుకోనందున, వీరిద్ద‌రూ వివాహం చేసుకునేందుకు ఇస్లాం మతాన్ని స్వీక‌రించారు. 1979 లో వీరి వివాహం జ‌రిగింది. అయితే ఈ జంటకు ఇషా డియోల్, అహానా డియోల్ కూతుళ్లు పుట్టారు.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలోమాట్లాడుతూ..  తాను హీరో ధర్మేంద్రను ఎలా పెళ్లి చేసుకున్నారు.. ఎందుకు పెళ్లి చేసుకున్న అన్న విషయం గురించి మాట్లాడారు. 

 

ధ‌ర్మేంద్ర‌ను చూసిన మొద‌టి రోజే అతను త‌న కోసమే పుట్టాడ‌ని అనిపించిందన్నారు. జీవితమంతా అతనితో గడపాలని కోరుకున్నాను.  కాకపోతే ఆయనకు అప్పటకే వివాహం జరిగింది.. ఈ కారణంతో కాస్త వెనుక అడుగు వేశానని.. కానీ ఆయను ప్రేమించడం మానలేదని చెప్పారు. కాకపోతే..   ధర్మేంద్ర, ప్రకాష్ కౌర్ విడిపోవాలని తాను ఎప్పుడూ కోరుకోలేద‌న్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: