టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో నితిన్ కి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ అభిమానులు తన కెరియర్ చాలా డార్క్ టైం లో ఉన్న సమయంలో తనకి అండగా నిలబడటం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఎంతో ప్రేమించే నితిన్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఇష్టమే. 'భీష్మ' సినిమా రాకముందు వరకు నితిన్ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అయితే తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' సినిమాలో అదిరిపోయే విజయాన్ని ఈ ఏడాది తన ఖాతాలో వేసుకున్నాడు. సరిగ్గా కరోనా వైరస్ రాకముందు లాక్ డౌన్ అమలులో ఉండక ముందు విడుదలైన 'భీష్మ' మంచి కలెక్షన్లు రాబట్టింది.

 

ఒక్కసారిగా కరోనా వైరస్ దేశం లోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలులోకి తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే నితిన్ సినిమాలకు నార్త్ లో మంచి క్రేజ్ ఉంది. కాగా ఇటీవల లాక్ డౌన్ అమలులో ఉండటంతో నితిన్ కెరియర్లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు మరియు ఫ్లాప్ అయిన సినిమాలకు అదిరిపోయే రెస్పాన్స్ యూట్యూబ్ లో వస్తుంది. నితిన్ నటించిన  “శ్రీనివాస కళ్యాణం” సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసింది.

 

దీనితో నితిన్ కెరీర్ లో మొత్తం నాలుగు సినిమాలు “అ ఆ”, “లై”, “ఛల్ మోహన రంగ” లతో కలిపి నాలుగు 100 మిలియన్ వ్యూస్ దాటిన సినిమాలు నితిన్ కు సొంతం అయ్యాయి. గమ్మత్తయిన విషయం ఏమిటంటే వీటిలో మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సినిమాలు. ఆ సినిమాలను హిందీ ప్రేక్షకులు బాగా చూస్తున్నారు. దీంతో ఎక్కువ వ్యూస్ లాక్ డౌన్ టైం లో నితిన్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు అని చాలామంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: