తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆడవాళ్లయితే మరీ తక్కువ మంది ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువ మందే ఉన్నా కూడా అవకాశాలు రాక బయటకి రావట్లేదని చెప్పుకొంటుంటారు. అయితే ఆ నిజానిజాలు దర్శక నిర్మాతలకే తెలియాలి. అయితే లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఫామ్ లో ఉన్న వారిలో యాక్టర్ ప్రగతి కూడా ఒకరు. అమ్మగా, అక్కగా, వదినగా ఆమె చేయని పాత్రంటూ లేదు.

 

ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో కనిపించింది. సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సంగతి తెలిసిందే. అలా మాట్లాడితే ప్రతీ ఇండస్ట్రీలో ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. సినిమా అనేది గ్లామర్ ఇండస్ట్రి కాబట్టి జనాలకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. యాక్టర్ ప్రగతి కూడా ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొందట. టాలీవుడ్ లో ఒకానొక టాఒ కమెడియన్ ఆమెని ఇబ్బంది పెట్టాడట.

 


తాజాగా ఆ విషయాలని బయటపెట్టింది యాక్టర్ ప్రగతి. అయితే ఆ కమెడియన్ పేరు మాత్రం చెప్పలేదు. కానీ అతను టాలీవుడ్ లో పేరు మోసిన కమెడియన్ అనీ, సంవత్సరానికి ౨౦ నుండీ ౩౦ సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవాడని తెలిపింది. నతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో కావాలనే ఇబ్బంది పెట్టాడని.. పదే పదే మాట్లాడేందుకు ప్రయత్నించడంతో పాటు ముట్టుకోడానికి కూడా ట్రై చేసాడని చెప్పింది. అతడి మాటలు చేష్టలు తనకు చాలా ఇబ్బందిని కలిగించాయట.

 

దాంతో కారవాన్ లోకి ఆయన్ని పిలిపించుకుని మీ ప్రవర్తన బాలేదని, ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చిందట. అప్పటి నుండి ఆ కమెడియన్ ఆమె జోలికి వెళ్లలేదట. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కలిసి చేసినప్పటికీ అలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పింది. మొత్తానికి ఆమె వార్నింగ్ బాగానే పనిచేసింది. కానీ ఆ బిజీ కమెడియన్ ఎవరనేది మాత్రం ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: