ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక వివాదం రేకెత్తిస్తుంటారు. నిన్న వైన్‌ షాపుల ముందు మందు కోసం క్యూలో నిలబడ్డ లేడీస్‌పై డైరెక్టర్ వర్మ కీలక కామెంట్స్ చేశారు. వైన్‌ షాపు క్యూలో నిలబడ్డ ఆడవాళ్లపై తన ట్విట్టర్‌లో వర్మ చేసిన ట్వీట్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌కి ఓ బాలీవుడ్ సింగర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ట్వీట్స్‌పై సోషల్ మీడియాలో మరింత చర్చ జరుగుతోంది. లాక్‌ డౌన్ నేపథ్యంలో ఇన్ని రోజులుగా మూతపడ్డ లిక్కర్ షాపులు కేంద్ర ప్రభుత్వ షరతులతో తెరుచుకున్నాయి. దీంతో మందు కోసం మగవారితో పాటు ఆడవాళ్లు కూడా క్యూ లైన్లలో నిలుచున్నారు. కాగా ఈ ఫొటో కాస్తా ఆర్జీవీ దృష్టికి రావడంతో.. ఆ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ‘చూడండి మద్యం షాపుల వద్ద ఎవరు క్యూలో ఉన్నారో. అవును పాపం, తాగే పురుషుల నుంచి మహిళలను రక్షించడం చాలా ముఖ్యం’.. అంటూ ఓ వెటకారపు ట్వీట్ చేశారు.

 


కాగా రామ్ గోపాల్ వర్మ వెటకారపు ట్వీట్ చూసిన బాలీవుడ్‌ సింగర్‌ సోనా మోహపత్రా కాస్త ఘాటుగానే రియాక్ట్ అయింది. ''డియర్ మిస్టర్ ఆర్జీవీ.. పురుషుల మాదిరిగానే.. మహిళలకు కూడా మద్యం కొనుక్కుని సేవించే హక్కు ఉంది. అయితే మందు తాగాక హింసాత్మకంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. మీ ట్వీట్ సెక్సిజం.. నైతికత రీక్స్ అర్థానికి వీలుగా ఉందంటూ'' కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు సింగర్ సోనా మెహపాత్ర. ప్రస్తుతం వీరు చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై బాలీవుడ్‌ రచయిత జావేద్‌ అక్తర్‌, నటి మలైకా అరోరా, రవీణా టాండన్‌ తదితరులు నిరసన వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: