అవసరం లేని విషయాల మీద ఫాన్ వార్స్ పెట్టుకోవడం ట్విటర్ లో పరిపాటి. ఇంపార్టెంట్ వ్యవహారం ఏదైనా జరిగినా - దానికి కావాల్సిన సపోర్ట్ అవసరం ఐనా దానిని గాల్లోకి పెట్టేసి .. మీ హీరో అట్లా మా హీరో ఇట్లా . అతను అప్పుడు అలా అన్నాడు , ఇతను ఈ టైమ్ లో ఇలా చేశాడు .. ఇదీ కథ. . సోషల్ మీడియా మొత్తం కూడా తీసి పారేయాల్సిన అంశాలు తలకి ఎక్కించుని, ముఖ్య ఘట్టాలు పక్కదారి పట్టిస్తున్నారు.. 

 

ఉదాహరణ కి రీసెంట్ గా విజయ్ దేవరకొండ అంశమే తీసుకుంటే .. కరోనా కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న మిడిల్ క్లాస్ కుటుంబాలకు అండగా ఓ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన 25 లక్షల్నీ విరాళం ఇవ్వడమే కాకుండా సొంతంగా తన మనుషులతో అవసరమున్న వారికి నిత్యావసర సరుకుల్నీ అందజేస్తున్నాడు.  దీనిమీద ఒక వెబ్ సైట్ మీడియా కావాలనే బురద జల్లే ప్రయత్నం చేసింది. ఈ ఫౌండేషన్ ని కరోనా టైమ్ లోనే కాకుండా నిరంతరం కొనసాగించాలి అనే ఊపు తో వాలంటీర్లని కూడా తీసుకుని సక్సెస్ ఫుల్ గా ముందుకి సాగుతున్నాడు ఈ కుర్ర హీరో. ప్రజలు ఇచ్చిన విరాళాల మొత్తం ఇప్పటికి రూ. 70 లక్షలు వచ్చాయని తెలుపుతూ తాము చేసే కార్యకలాపాల గురించి అప్ డేట్స్ ఇస్తున్నామని.. అవసరం ఉన్న వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంటే.. ఈ వెబ్ సైట్స్ తప్పుడు వార్తలు రాస్తున్నాయని మండిపడ్డాడు. 

 

విజయ్ మాటలకి చాలా గొంతులు జత కలిశాయి. మహేశ్ బాబు దగ్గర నుంచి కొరటాల శివ వరకూ ఇలా చాలామంది దీని మీద తమ గళం వినిపించారు. రవితేజ , హరీష్ శంకర్ , చిరంజీవి లాంటి వాళ్ళు సైతం విజయ్ కి అండగా నిలిచారు. 

 

పవన్ కల్యాణ్ ఫాన్స్ లో కొందరు పాత విషయాలు తవ్వే ప్రయత్నం చేయడం , సంబంధం లేని పరిస్థితి ఈ విజయ్ దేవరకొండ కి ఆపాదించడం తో సోషల్ మీడియా మొత్తం హాట్ హాట్ గా మారింది. పవన్ ఫాన్ ని అని చెప్పుకునే ఒక వ్యక్తి విజయ్ అప్పట్లో మాట్లాడిన ' తారాజువ్వలు ' ఆడియో వేడుక లో మహేశ్ కత్తి ని ఎగతాళి చేస్తూ ' కాంట్రవర్సీ ' ల గురించి మాట్లాడుతూ " మనం ఏది చేసినా మినిమమ్ డెత్ థ్రెట్ రావాలి " అంటూ ఎవరి పేరూ ఎత్తకుండా కత్తి మహేశ్ కి పంచ్ వేయడం కూడా కాంట్రవర్సీ గా చూపించే ప్రయత్నం చేయడం సోషల్ మీడియా లో విమర్శల కి దారి తీస్తోంది. 

 

సంబంధం లేని అంశాల్లో కి పవన్ కల్యాణ్ ని లాగడం .. అతని పార్టీకీ , ఫాన్స్ కీ డ్యామేజ్ తప్ప ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది . విజయ్ - పవన్ ఇద్దరికీ ఇలాంటి చర్యల వల్ల డ్యామేజీ జరుగుతూనే .. అలా దొంగ వార్తలు రాస్తున్న వెబ్ సైట్ లకి కొత్త సరుకు మనమే అందిస్తున్నట్టు ఉంది. ఇండస్ట్రీ నే కాదు దేశం అంతా కలిసి ఉండాల్సిన సమయం లో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం అంటున్నారు విశ్లేషకులు. ఎందరో సినిమా వాళ్ళ పర్సనల్ జీవితాల్లోకి తొంగి చూసే వెబ్ సైట్ రాతలన్నీ ఖండించాలి తప్ప మనం వారికి కొత్త స్టాఫ్ ఇవ్వడం ఎంతవరకూ కరక్ట్ ?

మరింత సమాచారం తెలుసుకోండి: