సుస్మితా సేన్ ఎవరినీ పట్టించుకోవడం లేదు. బాలీవుడ్ జనాల మాటలను, నెటిజన్ల కామెంట్స్ ను అన్నింటినీ లైట్ తీసుకుంటోంది. ఎవరేం అనుకున్నా.. నా దారి నాదే అన్నట్టు సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి పాఠాలు చెబుతోంది సుస్మిత. 

 

సుస్మితా సేన్ చాలా బోల్డ్ గా ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్స్ విషయంలో ఏ మాత్రం మొహమాటపడదు. బ్రేకప్ అయినా.. ప్యాచప్ అయినా.. అన్నింటినీ పబ్లిక్ గానే చూపిస్తుంది. లేటెస్ట్ గా నడుస్తోన్న రోహమాన్ షాల్ లవ్ స్టోరీని కూడా ఇలాగే పబ్లిక్ ప్లాట్ ఫార్మ్ మీద పెట్టేసింది. ఇద్దరు కలిసి చేస్తోన్న కసరత్తులతో ఫాలోవర్స్ కు పాఠాలు చెబుతోంది. 

 

సుస్మితాసేన్, రోహమాన్ షాల్ ఏడాదిన్నరగా లవ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. సుస్మిత కంటే రొహమాన్ చిన్నోడు అయినా.. ఇద్దరి మధ్య 15ఏళ్లు గ్యాప్ ఉన్నా.. ఇది పెద్ద సమస్యేకాదంటూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. పెళ్లి కాని భార్యాభర్తల్లా ఇంటి వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయితే హాలిడే ట్రిప్పులతో బిజీగా గడిపే ఈ లవ్ బర్డ్స్ కు లాక్ డౌన్ బ్రేకులేసింది. దీంతో ఇంటి నుంచే పాఠాలు చెబుతున్నారు. 

 

సుస్మితా సేన్ ఫిట్ నెస్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకే 44ఏళ్ల వయసులోనూ గ్లామర్ గా కనిపిస్తోంది. ఇక లాక్ డౌన్ లోనూ గ్లామర్ ని కాపాడుకోవడానికి కష్టపడుతోంది సుస్మిత. బాయ్ ఫ్రెండ్ రొహమాన్ తో కలిసి కపుల్ వర్కవుట్స్ చేస్తోంది. ఇద్దరు కలిసి యోగా చేస్తోన్న వీడియోలు పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెట్టినా..  పెళ్లికి ముందు ఏంటీ పనులు అని రాతలు రాస్తోన్నా.. సుస్మిత మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. మొత్తానికి సుస్మిత ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటోంది. తన లైఫ్ తన ఇష్టమంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: