టాలీవుడ్ స్టార్స్ సడన్ గా వెనక్కి వెళ్లిపోతున్నారు. టైమ్ మెషీన్ ఎక్కి రివర్స్ లో రాజుల కాలంలోకి వెళ్తున్నారు. భారీ ఖర్చుతో పీరియాడికల్ డ్రామాల్లోకి జర్నీ చేస్తున్నారు. ఇక ఈ ప్రయాణం విలువ 700కోట్లకు పైనే ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

 

మాసిజానికి, కమర్షియల్ ఎంటర్ టైనర్స్ కు కేరాఫ్ అనిపించుకున్న హీరో పవన్ కళ్యాణ్ పాటలు, ఫైట్ లు, కామెడీ ట్రాక్స్ ఇలా అన్ని లెక్కలతో సినిమాలు చేసే పవన్ ఫస్ట్ టైమ్ పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో బ్రిటీష్ కాలం నాటి కథలో నటిస్తున్నాడు పవన్. 

 

వైవిధ్యమైన అంశాలను టచ్ చేసే క్రిష్, పవన్ కళ్యాణ్ తో రాబిన్ హుడ్ తరహా సినిమా తీస్తున్నాడు. బ్రిటీష్ పాలకులు భారతీయుల నుంచి అక్రమంగా లాక్కున్న సంపదని, దోచుకొని తిరిగి ప్రజలకే పంచే మంచి దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు పవన్. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నిర్మాత ఏఎం రత్నం 200కోట్ల వరకు కేటాయించాడని చెబుతున్నారు. 

 

పీరియాడికల్ డ్రామా బాహుబలితో ఇండియన్ ఆడియన్స్ ను మహిష్మతి సామ్రాజ్యంలోకి తీసుకెళ్లిన రాజమౌళి, ట్రిపుల్ ఆర్ తో మన్యం వీరుల పోరాటపటిమని, త్యాగనిరతిని చూపించబోతున్నాడు. అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల స్ఫూర్తితో ట్రిపుల్ ఆర్ తీస్తున్నాడు రాజమౌళి. 

 

ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుంటే.. తారక్ కొమరం భీమ్ గా కనిపిస్తున్నాడు. నందమూరి, కొణిదెల హీరోలు కలిసి నటిస్తోన్న ఈ సినిమాను 400కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు దానయ్య. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న ఈ రిలీజ్ కాబోతోంది. 

 

రొటీన్ ట్రాక్ ను విడిచిపెట్టి కొంచెం కొత్తగా ట్రై చేస్తేనే ఆడియన్స్ సర్ ప్రైజ్ అవుతారు. విభిన్నమైన కథాంశాల్లో నటిస్తే గ్రాఫ్ కూడా సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుంది. అందుకే యంగ్ స్టర్స్ చాలామంది టైమ్ మెషీన్ ఎక్కుతున్నారు. పాతకాలంలోకి వెళ్లిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: