రెబల్ స్టార్ ప్రభాస్ మరియు నాగ అశ్విన్ ల కాంబినేషన్లో అతి త్వరలో తెరకెక్కనున్న భారీ ప్రతిష్టాత్మక సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ నిర్మించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ కోలీవుడ్ నటుడు అరవిందస్వామి కనిపించనున్నట్లు రెండు రోజులుగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, అరవింద స్వామి నటిస్తోంది ప్రభాస్ సినిమాలో కాదని, అతి త్వరలో జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో అని కొందరు అంటున్నారు. 

IHG

వాస్తవానికి ఈ సినిమా కథ ఇప్పటికే పూర్తిగా సిద్ధమైందని, కొంత రాజకీయ సమీకరణాలతో పాటు, ఆకట్టుకునే ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాని అన్ని వర్గాలను ఆకట్టుకునేలా తెరకెక్కించనున్నట్లు టాక్. ఇకపోతే ఈ సినిమాలో హీరో ఎన్టీఆర్ పాత్ర కొంత డిఫరెంట్ గా ఉండటంతో పాటు, ఎంతో పవర్ ఫుల్ గా ఉండనుందట. అలానే ఆయనకు సమవుజ్జీగా ఉండేలా విలన్ పాత్రను కూడా డిజైన్ చేయడం జరిగిందట. కాగా ఆ పాత్రకు ముందుగా ఒక బాలీవుడ్ నటుడిని అనుకున్నప్పటికీ, అతడికి ప్రస్తుతం కాల్షీట్స్ లేని కారణంగా ఆయన స్థానంలో అరవింద స్వామిని ఎంపిక చేశారట. 

IHG's not pan-Indian, it's pan ...

కాగా రెండు రోజుల క్రితం అరవింద స్వామికి కథ మొత్తం ఫోన్ లో వినిపించిన త్రివిక్రమ్, ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారట. మరికొద్ది రోజుల్లో లాంఛనంగా ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు, విలన్ పాత్రలో నటించనున్నారని అరవిందస్వామి విషయం కూడా అధికారికంగా వెల్లడి కానుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో లేదో తెలియదు కానీ, ఇదే కనుక నిజమైతే మాత్రం ఒకరకంగా అరవిందస్వామికి ఇది టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చే మంచి సినిమా అవుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: