వివాదాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ బ‌యోపిక్‌ల స్పెష‌లిస్ట్ అని చెప్పాలి. ఆయ‌న ఎక్కువ‌గా స‌మాజంలో వివాదాల‌తో ఉన్న వ్య‌క్తుల‌నే  ఆధారంగా తీసుకుని ఎన్నో చిత్రాల‌ను తెర‌కెక్కించారు. అయితే వీరిలో కొన్ని బ‌యోపిక్ లు తీయ‌డానికి కూడా కొంత మంది భ‌య‌ప‌డ‌తారు. కానీ వ‌ర్మ స్టైలే వేరు ఆయ‌న ఘ‌ట్సే వేరు. ఆయ‌న తీసే కొన్ని చిత్రాల వ‌ల్ల ఆయ‌న‌కు ఇబ్బందులు ఎదుర‌వుతాయి అని తెలిసిన‌ప్ప‌టికీ వెన‌క‌డుగు వేయ‌డు. వీడు మ‌గాడ్రా బుజ్జీ అనే రేంజ్‌లో సినిమాలు తీస్తాడు. ఆ మ‌ధ్య కాలంలో క‌రెక్ట్‌గా ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌ర్మ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రాన్ని తీశారు. అందులో ప్ర‌తి ఒక్క‌పాత్ర కూడా దానికి త‌గ్గ‌ట్టుగానే సూట‌య్యాయి అన్న‌ట్లు ఉంటాయి పాత్ర‌లు. ఏ ఒక్క‌పాత్ర కూడా మ‌న‌కు క‌ల్పిత పాత్ర‌లాగా అనిపించ‌దు. 

 

వ‌ర్మ ఏ సినిమా తీసినా కూడా నేను న‌మ్మిన నిజాన్ని నేను చెప్పాను. `ఇలా జ‌ర‌గ‌లేదు` అని ఎవ‌రైనా అనుకుంటే, వారు న‌మ్మిన‌దాన్ని బ‌ట్టి సినిమా తీసుకోవ‌చ్చు . నాకేం అభ్యంత‌రం లేదు`` అని  ఆ సినిమా స‌మ‌యంలో రాంగోపాల్ వ‌ర్మ తెలిపారు. జీవీ ఫిలింస్ స‌మ‌ర్ప‌ణ‌లో రాకేష్ రెడ్డి, దీప్తి బాల‌గారి నిర్మాత‌లుగా రాంగోపాల్ వ‌ర్మ‌, ఆగ‌స్త్య మంజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`. మార్చి 29న సినిమా విడుద‌ల‌యింది. 

 

ల‌క్ష్మీపార్వ‌తి ఆయ‌న జీవితంలో ప్ర‌వేశించిన స‌మ‌యం నుంచి ఈ క‌థ తీశారు. నాదెండ్ల‌ భాస్క‌ర‌రావు చేసింది పెద్ద కుట్రా... చ‌ంద్ర‌బాబు నాయుడు చేసింది పెద్ద కుట్రా. అన్న పాయింట్ ని రేజ్ చేస్తూ చాలా చ‌క్క‌గా క‌థ‌ను తీర్చిదిద్దారు వ‌ర్మ‌. నాదెండ్ల భాస్క‌ర‌రావు పార్టీకోసం త‌ప్ప ఆయ‌న‌తో పెద్ద‌గా క‌లిసింది లేదు. కానీ కుటుంబీకులు అలా కాదు. ర‌క్త‌సంబంధీకులు, ద‌గ్గ‌రివాళ్లు చేసిన కుట్ర ఎప్పుడూ పెద్ద కుట్రే అవుతుంది. ఇక చంద్ర‌బాబు పాత్ర‌లో న‌టించిన శ్రీ‌తేజ్ చాలా అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు. చంద్ర‌బాబు బాడీ ల్యాంగ్వేజ్‌, ఆయ‌న రూపు రేక‌లు డిట్టో చంద్ర‌బాబే పూనాడా అన్న‌ట్లు ఉంది ఆయ‌న పాత్ర‌. ఆ త‌ర్వాత తీసిన అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు చిత్రంలో కూడా చంద్ర‌బాబు పాత్ర కోసం ఎవ‌రినో తీసుకొచ్చి పెట్టారు కానీ శ్రీ‌తేజ్ అంత హైలెట్ అయితే కాలేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: