కరోనా లాక్‌ డౌన్‌ తో ఇంటికే పరిమితమైన ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తున్నాడు. అనుకోని విధంగా వచ్చిన ఈ హాలిడేస్ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తూనే లాక్‌ డౌన్‌ వేళ తమ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. డేవిడ్ వార్న‌ర్ చాలాకాలంగా టిక్‌ టాక్‌ తోపాటు ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలలో వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. లాక్‌ డౌన్‌ విధించినప్పటి నుంచీ తరచూ ఏదో ఒక వీడియోతో ఇన్‌స్టాగ్రామ్‌ లో అభిమానులను సంతోష పెడుతున్నాడు మన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్ వార్నర్. ఎప్పుడూ క్రికెట్ గ్రౌండ్ లో పరుగుల వరద పారించే ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ ఇప్పుడు తన భార్యతో కలిసి స్టెప్పులేస్తున్నాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు 'పోకిరి' సినిమా డైలాగ్ చెప్పిన వీడియో వైరల్ అయింది.

 
మొన్న అల వైకుంఠపురంలో సినిమాలోని బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులు ఇరగదీసిన వార్నర్‌.. నిన్న తమిళ సాంగ్‌ సన్నజాజి పడక పాటకి డ్యాన్స్‌ చేశాడు. తన భార్య క్యాండీస్‌తో కలిసి ఈ సాంగ్‌ కు టిక్‌టాక్‌ చేశాడు. ఇప్పుడు తాజాగా మరో టిక్ టాక్ వీడియోతో వచ్చాడు డేవిడ్ వార్నర్. ఈసారి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోని డైలాగ్ చెప్పి ఇరగదీసాడు. 'పోకిరి' సినిమాలో మహేష్ చెప్పిన 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అంటూ టిక్ టాక్ చేసాడు. ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియోను పోస్టు చేస్తూ.. '' ఈ సినిమా పేరు కనుక్కోండి.. గుడ్ లక్..'' అంటూ కామెంట్ జత చేసాడు. ఇది నిమిషాల్లో వైరల్‌ కావడం​తో అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ప్రధానంగా సౌత్‌ ఇండియా సినిమాల్లోని పాటలకు వార్నర్‌ టిక్‌టాక్‌ వీడియోలు చేయడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ‘ఈ కరోనా సంక్షోభంలో ఒకే ఒక్క క్రికెటర్‌ నాకు కావాల్సిన వినోదాన్ని ఇస్తున్నాడు’ అని వార్నర్‌ను కొనియాడాడు. ఇంకొన్ని వీడియోలు చేయాలంటూ వార్నర్‌ను కోరుతున్నారు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Guess the movie?? I tried everyone 🤷🏼‍♂️🤷🏼‍♂️Good luck 😂😂 #tollywood #requested #helpme #

A post shared by David Warner (@davidwarner31) on

మరింత సమాచారం తెలుసుకోండి: