కరోనా వైరస్ వల్ల థియేటర్లు మూత పడటంతో పాటు జనాలలో భయం నెలకొంది. లాక్ డౌన్ కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయటంతో అన్ని సినిమా థియేటర్లు క్లోజ్ అయిపోయాయి. అయితే ఈ సమయంలో లాక్ డౌన్ ఎత్తివేస్తే సినిమా థియేటర్ కి జనాలు వచ్చే అవకాశం ఉందా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొనివుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే కచ్చితంగా జనాలు వచ్చే అవకాశం ఉందని సినిమా ధియేటర్ సరైనది అయితే గ్యారెంటీగా జనాలు వస్తారని ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ సినిమా రిలీజ్ అవ్వడానికి చాన్స్ లేదు. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ కాపీ రెడీ అవడానికి కనీసం వారమైన పడుతుంది.

 

ఇదే సమయంలో ప్రమోషన్లు కి ఓ వారం పది రోజులు టైం పట్టిన ఆశ్చర్య పడనక్కరలేదు. మొత్తం మీద చూస్తే లాక్ డౌన్ లిఫ్ట్ చేస్తే కనీసం రెండు వారాలు అన్నా పడుతుంది సినిమా ధియేటర్ లు ఓపెన్ అవ్వటానికి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ బట్టి చూస్తే థియేటర్లు ఓపెన్ చేస్తే మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఏసీలో ఒకరి నుండి ఒకరికి వైరస్  వ్యాప్తి చెందే అవకాశం ఉందని వార్తలు వస్తున్న తరుణంలో సినిమా థియేటర్ ఓపెన్ ఇప్పుడప్పుడే చేయకూడదని పేర్కొంటున్నారు.

 

మద్యం షాపులు ఓపెన్ చేస్తే ఎగబడి మరీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా జనాలు వ్యవహరించారు. అలాంటిది సినిమా ధియేటర్ ఓపెన్ చేసి కొత్త సినిమాలు వేస్తే ఉన్న కొద్ది వైరస్ విజృంభించడం గ్యారెంటీ అని...ఇప్పటిదాకా పాటించిన జాగ్రత్తలు వేస్ట్ అయిపోతాయి అని చాలామంది అంటున్నారు. మరోపక్క థియేటర్ యజమానులు కూడా ఏ విధంగా సినిమా ధియేటర్ లు ఓపెన్ చేస్తే వ్యవహరించాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: