ఓవర్సీస్ మార్కెట్ చూసి తెలుగు సినిమా మురిసిపోయింది. మిలియన్ అనే కాదు.. రెండు, మూడు మిలియన్ మార్క్స్ ఈజీగా దాటేసింది. అయితే ఏడాది నుంచి ఓవర్సీస్ బిజినెస్ చాలా డల్ అయిపోయింది. విదేశాల్లో హిట్ అయిన తెలుగు సినిమా అంటే.. రెండేళ్లలో పట్టుమని పది కూడా లేవు. 2020లో అయినా ఓవర్సీస్ ఊపిరి పీల్చుకుంటుందంటే.. మూలుగుతున్న సినిమాపై కరోనా పడింది. 

 

గతంలో ఆశాజనకంగా కనిపించిన ఓవర్సీస్ మార్కెట్ గతేడాది తీవ్ర నష్టాలు చూసింది. ఎఫ్ 2.. మజిలీ.. ఓ బేబీ లాంటి నాలుగైదు సినిమా మాత్రమే లాభాలు తీసుకొచ్చాయి. ఇస్మార్ట్ శంకర్, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఇక్కడ హిట్ అయినా.. ఓవర్సీస్ లో పెట్టుబడిని రాబట్టలేదు.

 

మజిలీ తర్వాత ఓవర్సీస్ హిట్ కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. అల వైకుంఠపురములో సక్సెస్ తో ఓవర్సీస్ ఊపిరిపీల్చుకుందనుకుంటే.. కరోనాతో అసలుకే మోసం వచ్చింది. ఈ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో కంటే.. ఓవర్సీస్ పై ఎక్కువ ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. 

 

ఓవర్సీస్ మార్కెట్ అంటే.. సగం పైగా వసూళ్లు యూఎస్ నుంచే వస్తాయి. అక్కడ బొమ్మ హిట్ అయితే.. ఓవర్సీస్ లో పంట పండినట్టే గానీ.. కరోనాతో మారిన పరిస్థితులతో ఓవర్సీస్ మార్కెట్ కు గట్టిదెబ్బ తగిలిందంటున్నారు. థియేటర్ కు వెళ్లి చూసే పరిస్థితి సగానికి తగ్గుతుందని అంచనా. అసలే అరకొర సక్సెస్ లతో సతమతమవుతుంటే.. కరోనా కలకలం నుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుందని అంచనా. 

 

అదే ఏడాదా.. రెండేళ్లా.. అనేది ఇప్పుడే చెప్పలేం అంటున్నారు. కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కరోనా తగ్గి జనాలు థియేటర్స్ కు రావడం మొదలుపెట్టినా.. వాళ్లకు సినిమాలు తీయగలిగితేనే ఓవర్సీస్ పుంజుకుంటుంది. లాక్ డౌన్ తర్వాత మళ్లీ పాతరోజులు వస్తాయేమో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: