ఇంద్ర, ఠాగూర్ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి కొన్నాళ్లుగా సెట్స్ మీద ఉన్న అంజి సినిమాను ఎట్టకేలకు రిలీజ్ చేసిన టైం అది. అయితే అనుకున్నట్టుగానే అంజి ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక అప్పుడు తర్వాత ఏ సినిమా చేయాలి అనుకున్న టైం లో బాలీవుడ్ లో సూపర్ హిట్టైన మున్నాభాయ్ mbbs సినిమా రీమేక్ చేయాలని అనుకున్నారు. జయంత్ సి.పరాన్జీ డైరక్ష లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. 

 

బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరాణి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మూలకథ అలానే ఉంచి తెలుగులో కొద్దిపాటి మార్పులతో సినిమా చేశారు. చిరు కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ చేశాడు హీరో శ్రీకాంత్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. సాంగ్స్ తో కూడా సినిమాకు మంచి క్రేజ్ తెచ్చారు. శంకర్ దాదా mbbs సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. 

 

రాజ్ కుమార్ హిరాణి కథను తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాను రీ రైట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో యువ హీరోలు రోహిత్ నటించారు. ఇక సినిమాలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వగా చైల్డ్ ఆర్టిస్ట్ గా రిలీజ్ కాబోతున్న ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ నటించారు. డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ లోనే కాదు కామెడీలో కూడా తనకు తానే సాటి అనేలా చేసుకున్నాడు చిరంజీవి. సినిమాకు సీక్వల్ గా శంకర్ దాదా జిందాబాద్ సినిమా కూడా చేశారు చిరంజీవి. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన శంకర్ దాదా జిందాబాద్ లో కూడా సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: