ఈ లాక్ డౌన్ వేళా టాలీవూడ్ హీరో + విలన్ అదేనండి బల్లాల్ దేవ్ కి పెళ్లి కుదిరింది.. అది కూడా హైదరాబాద్ కి చెందిన మిహిక బజాజ్ తో పెళ్లి నిశ్చయమైంది. ప్రేమిస్తున్నప్పటికీ ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న రానా తన ప్రేమ గురించి ప్రజలందరికి అధికారకంగా తెలియజేస్తూ ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు..
అంతేకాదు.. ఆమె ఫొటోతో షేర్ చేస్తూ... ఆమె నా ప్రేమను అంగీకరించింది అంటూ ట్విట్ చేశాడు.. దీంతో సెలబ్రెటీలు అంత కంగ్రాట్స్ చెప్తుండగా.. నెటిజన్లు అంత రానా పెళ్లిపై జోకులు వేస్తున్నారు.. ఇంకా ఈ నేపథ్యంలోనే నాని కూడా న్యాచురల్ స్టార్ నాని కూడా తనదైన శైలిలో స్పందించాడు..
ఆ ట్విట్ చూసి అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు.. రానా.. మీహిక బజాజ్ ఫోటో షేర్ చేస్తూ.. 2020లో ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో.. ఈ సందర్భంగా నీకు ఈ సాంగ్‌ను డేడికేట్ చేస్తున్నాను అంటూ హమారా బజాజ్ అంటూ వచ్చే యాడ్ ని పోస్ట్ చేస్తూ.. జోక్స్ పక్కన పెడితే సూపర్ హ్యాపీ బాబాయ్'' అంటూ అభినందనలు తెలిపాడు.. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంకా ఏమేమి చూడాల్సివస్తుందో 2020 లో
— nani (@NameisNani) May 12, 2020
Dedicating this song to you on this occasion https://t.co/qCXzBKCJvz
Jokes apart ... super happy babai ❤️ https://t.co/ZeCJkmCLk7