సినిమా ఎవరిదైనా కరెక్ట్ టైం లో కరెక్ట్ ఐటెమ్ సాంగ్ పడితే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. సినిమా సీరియస్ గా నడుస్తున్న టైం లో ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు ఐటెమ్ సాంగ్స్ ప్లాన్ చేస్తారు. హీరోల స్టామినాను బట్టి ఈ సాంగ్స్ ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ స్పెషల్ సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. కమర్షియల్ సినిమా అంటే అన్ని వర్గాల ఆడియెన్స్ ను మెప్పించాలి. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ కోరుకునే ఐటెమ్ సాంగ్స్ కచ్చితంగా ఉండాల్సిందే. 

 

చిరు నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో బాలీవుడ్ భామ యానా గుప్తా అదరగొట్టింది. ఆకలేస్తే అన్నం పెడతా.. అంటూ వచ్చే ఈ సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్ కాగా అందులో ఈ సాంగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చిరు సినిమా అంటేనే మెగా మాస్ ఆడియెన్స్ కు పండుగే అలాంటి సినిమాలో ఐటెమ్ సాంగ్ అంటే చెలరేగిపోతుంది. 

 

బాలీవుడ్ భామ యానా గుప్త ఈ సాంగ్ తర్వాత కూడా ఒకటి రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఆమె చేసిన ఐటెమ్ సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అని చెప్పొచ్చు. మరి రానున్న రోజుల్లో కూడా యానా గుప్త మళ్ళీ ఇలాంటి స్పెషల్ ఐటెమ్ సాంగ్స్ లో కనిపించాలని ఆశిద్దాం. చిరుతో చేసిన ఆకలేస్తే సాంగ్ ఇప్పటికి ఫంక్షన్స్ లో వినిపిస్తూనే ఉంటుంది. మాములుగానే చిరు సాంగ్స్ అంటే బాగానే పాపులర్ అవుతాయి.. ఇక అందులో ఇలాంటి స్పెషల్ సాంగ్స్ అయితే అదరగొట్టేస్తాయి. రీ ఎంట్రీ తర్వాత తీసిన ఖైదీ నంబర్ 150లో కూడా రత్తాలు సాంగ్ తో అలరించాడు చిరు. ఆ సాంగ్ లో లక్ష్మి రాయ్ చిరుతో డ్యాన్స్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: