ఏదైనా స్టార్ హీరో సినిమా వచ్చిందంటే చాలు అందులో ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే అని భావిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఆ సినిమాలో హీరో ఎంత యాక్షన్ సీన్లలో అదరగొట్టినప్పటికీ... హీరోయిన్ తో రొమాన్స్ లు కూడా ఇరగదీసినప్పటికీ... ఐటెం సాంగ్ లేకపోతే మాత్రం ప్రేక్షకులు బాగా హర్ట్ అయిపోతారు. అందుకే స్టార్ హీరో సినిమా అంటే పక్క ఒక ఐటమ్ సాంగ్  ఉండాల్సిందే. లేకపోతే ఒక స్పెషల్ సాంగ్ లో స్పెషల్ ఎంట్రీ అయిన ఉండాల్సిందే. ఇలాంటి ఒక స్పెషల్ సాంగ్ ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా ఉర్రూతలూగించింది.... 

 

 

 ఆ స్పెషల్ సాంగ్ ఏ సినిమాలోదో  కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో. మామూలుగా అయితే ఐటెం సాంగ్స్ సినిమా మధ్యలో ఉంటాయి. కానీ ఇందులో ఇది ఐటమ్ సాంగ్ అనాలా స్పెషల్ గెస్ట్ రోల్ అనాలా  అర్థం కాదు. కానీ ప్రేక్షకులకు మాత్రం ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ దొరికింది అని చెప్పాలి. సినిమా మొదలు కాగానే పది నిమిషాల్లోనే... డాంగ్ డాంగ్ అనే సాంగ్ తో స్పెషల్ సాంగ్ మొదలవుతుంది. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఎంట్రీ ఇచ్చి తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది. 

 

 

 మామూలుగానే తమన్నా డాన్స్ బాగా చేస్తుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఈ పాటలో  మహేష్ బాబు కూడా తమన్నాతో  పాటుగా ఇరగదీసే డాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకులను మరింత ఉర్రూతలూగించాడు. డాంగ్  డాంగ్  అంటూ మొదలయ్యే ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంత ఉర్రూతలూగించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా విడుదలైన చాలా రోజుల పాటు ఈ పాట ట్రెండింగ్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: