బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన చిత్రం జై లవ కుశ. ఈ సినిమా టాలీవుడ్ లో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ సినిమాలో అతను మూడు పాత్రల్లో నటించాడు. ఈ సినిమా కోసం తారక్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ప్రతీ సీన్ లో కూడా అతను జీవించాడు. అతను నటన కూడా టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత అగ్ర దర్శక నిర్మాతలు అయితే తారక్ తో సినిమా చేయడానికి చాలా ఆసక్తి చూపించారు. కథ బాగుంది అనుకుంటే తారక్ మంచి హీరో అంటూ అగ్ర దర్శక నిర్మాతలు అతని డేట్స్ కోసం ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. 

 

ఇక ఈ సినిమాలో ఉండే కొన్ని పాటలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో తమన్నా డాన్స్ వేసిన స్వింగ్ జరా అనే పాట సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఐటెం గర్ల్ గా మంచి డిమాండ్ వచ్చింది. ఈ సినిమాలో ఆ పాట కోసం దర్శకుడు బాబీ చాలా కష్టపడ్డాడు. ఆ పాట టాలీవుడ్ లో ఒక ఊపు ఊపింది. ఇక ఆ పాటలో తమన్నా డాన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది ప్రేక్షకులను అనేది వాస్తవ౦. ఆ విధంగా ఈ పాట కోసం అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఈ పాట లిరిక్స్ కూడా యూత్ ని బాగా ఆకట్టుకుంది. 

 

సినిమా తర్వాత తమన్నా కొన్ని ఐటెం సాంగ్స్ ని చేసింది. ఆ పాటలు ఎంత హిట్ అయ్యాయి అనేది పక్కన పెడితే ఈ పాట తర్వాత మాత్రం ఆమెకు మంచి డిమాండ్ వచ్చింది. ఇప్పుడు సినిమాలకు ఆమె దాదాపుగా దూరంగానే ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: