కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ లను పూర్తిగా నిలిచిపోయాయి. పెద్ద సినిమా నుంచి వచ్చిన సినిమాల వరకు అన్ని సినిమా షూటింగ్ లు నిలిచిపోయే ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీల అందరూ ఇంటికే పరిమితమయ్యారు, అయితే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న లేదా ఇంకా మొదలు కానీ సినిమాల పరిస్థితి అయితే పర్వాలేదు కానీ అన్నీ పూర్తి చేసుకుని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న సినిమా నిర్మాతల పరిస్థితి అయితే దారుణంగా మారిపోయింది.
దీంతో ఈ మధ్యకాలంలో ఆన్లైన్ స్ట్రీమింగ్ కంపెనీలకు గిరాకీ బాగా పెరిగిపోయింది. ఇప్పట్లో సినిమా థియేటర్లు తెలుసుకునే అవకాశం కూడా లేకపోవడంతో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అందరూ ఆన్లైన్ డిజిటల్ స్ట్రీమింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు.తమ తమ సినిమాలను ఆన్లైన్ లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు
ఓవైపు కొత్త సినిమాల విడుదల మరోవైపు విడుదలైన సినిమాలు ఆన్లైన్లో స్ట్రీమింగ్ చేస్తుండడంతో అటు ప్రేక్షకులకు కూడా ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది.
మరి కొంతమంది ఇప్పటికే విడుదలైన సినిమాలు ఆన్లైన్లో స్ట్రీమింగ్ చేయడం ద్వారా మరికొన్ని లాభాలను పొందవచ్చు అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో విడుదలైన దర్శకుడు సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో కి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ అందరికీ అందుబాటులో ఉంది . ఈ సినిమా ఎప్పుడో విడుదల అయినప్పటికీ ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో కి రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది అని చెప్పాలి. ఒకవేళ దర్శకుడు సినిమా చూడని వారు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో హాయిగా చూసేయొచ్చు.
#Darshakudu movie Now Exclusively Available On @PrimeVideoIN
— sukumar Writings (@SukumarWritings) May 15, 2020
👉 https://t.co/LppbB3UDye@YoursEesha @priyadarshi_i @mrnoelsean @pujita_ponnada pic.twitter.com/Ix7DreiIs5