పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వడం ఆలస్యం ప్రొడ్యూసర్లకు బోల్డంత ఎనర్జీ వచ్చింది. చాలామంది అడ్వాన్స్ లు కూడా రెడీ చేసుకున్నారు. దర్శకులు సబ్జెక్టులు రెడీ చేసుకొని పవన్ ను మీట్ అయ్యారు. ఇక బాబీ, డాలీ లాంటి దర్శకులు లాక్ డౌన్ లోనూ పవన్ కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇలా చాలామంది మేకర్స్ పవన్ కాల్షీట్స్ కోసం ప్రయత్నిస్తోంటే ఈ హీరో మాత్రం హీరోయిన్ల విషయం తేల్చుకోలేకపోతున్నాడు. 

 

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. పైగా హీరో రీ-ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. పవర్ స్టార్ ఈ ఇన్నింగ్స్ లో ఎలాంటి మేజిక్స్ ఇస్తాడో అని ట్రేడ్ పండిట్స్ కూడా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమాకు ఇప్పటికీ హీరోయిన్ సెట్ అవ్వలేదు. 

 

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్  సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీ హిందీ హిట్ పింక్ రీమేక్ గా తెరకెక్కుతోంది. అక్కడ అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను ఇక్కడ పవన్ ప్లే చేస్తున్నాడు. ఇక కమర్షియల్ హీరోయిజం తక్కవు, కంటెంట్ ఎక్కువగా ఉన్న పింక్ స్టోరీని పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్చారు. ఓ ఫ్లాష్ బ్యాక్, దాంట్లో హీరోయిన్ ను సెట్ చేశారు. అయితే ఈ ట్రాక్ కు ఇంత వరకు హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు మేకర్స్. 

 

పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో మూడు సినిమాలకు సైన్ చేశాడు. వీటిల్లో రెండు ప్రాజెక్టులు కూడా సెట్స్ కు వెళ్లాయి. అయితే ప్రారంభోత్సవాలు, షూటింగ్ లు ఎంత స్పీడ్ గా జరుపుకున్నాయే.. హీరోయిన్ల విషయంలో అంత ఎక్కువగా ఆలోచిస్తున్నాయీ చిత్రాలు. ఇమేజ్, మార్కెట్ అంటూ హీరోయిన్ల కోసం సెర్చింగులు చేస్తున్నాయి. 

 

వకీల్ సాబ్ లో హీరోయిన్ క్యారెక్టర్ కు అంతగా ఇంపార్టెన్స్ లేదు. అందుకే ఈ సినిమాలో నటించేందుకు స్టార్ హీరోయిన్లు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. ఇక ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో నటించబోతున్నాడు. ఔరంగజేబు లాంటి కథాంశంతో రాబోతోంది ఈ సినిమా. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ కు ప్లస్ అయ్యే బ్యూటీని తీసుకోవాలనుకుంటున్నాడు క్రిష్. 

 

గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ని డైరెక్ట్ చేసిన హరీశ్ శంకర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు పవన్. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతోంది. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మళయాళీ బ్యూటీ మానసా రాధాకృష్ణన్ ని హీరోయిన్ గా తీసుకుంటారనే టాక్ వచ్చింది. కానీ  ఈ ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు హరీశ్ శంకర్. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: