టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులకు ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిన విషయమే వీరి కాంబినేషన్ లో దాదాపుగా మూడు నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ మూడు నాలుగు సినిమాలు కూడా చాలా ఘన విజయాలను నమోదు చేసాయి అనేది వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఈ స్థాయిలో హిట్ లు ఇచ్చిన దర్శకుడు మరొకరు లేరు. అసలు ఆయన్ను స్టార్ దర్శకుడు చేసింది జూనియర్ ఎన్టీఆర్ సినిమాలే అనేది వాస్తవం. వీరి కాంబినేషన్ లో సినిమా అనగానే చాలా మందికి ఒకరకంగా పండగ అనేది తెలిసిందే. 

 

ఇక వీరు ఇద్దరూ వ్యక్తిగత జీవితంలో చాలా మంచి స్నేహితులు అని అంటూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జక్కన్న ముందు నుంచి కూడా చాలా సానుకూలంగా ఉండే వారు అని. మంచి కథ ఏది ఉన్నా సరే తారక్ కి వినిపించిన తర్వాతే మరొకరికి వినిపించే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. తారక్ కి కూడా ఆయన అంటే చాలా గౌరవం అని చెప్తారు. వీరి ఇద్దరూ కూడా తమ జీవితంలో కష్ట నష్టాలను అన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తారక్ సినిమా చేద్దాం అని అడిగిన వెంటనే జక్కన్న మరో ఆలోచన లేకుండా సినిమాను ఓకే చేస్తూ ఉంటారట. 

 

ఇక వీరి కుటుంబాల్లో ఏది రహస్యం ఉండదు అని ప్రతీ విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారని అంటారు. టాలీవుడ్ లో వీరి హవా ఇప్పుడు ఒక రేంజ్ లో ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: