తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటుల మధ్య ఎన్నో ఏళ్ల నుంచి మంచి స్నేహబంధం కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక తమ అభిమాన హీరోల మధ్య ఉండే స్నేహ బంధానికి అటు ప్రేక్షకులు అభిమానులు కూడా ఎంతో మురిసి పోతూ ఉంటారు. ఇలా టాలీవుడ్లో మంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతూ... ఎప్పుడు తెర మీద కనిపించిన సందడి చేసే హీరోలు మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ అని చెప్పాలి. 

 

 వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహ బంధం ఉంటుంది. అంతేకాకుండా శ్రీకాంత్ చిరంజీవి పలు సినిమాల్లో కలిసి నటించారు కూడా. ఇక శ్రీకాంత్ చిరంజీవి కాంబినేషన్ సినిమాలు   బాగా ఇష్టపడుతూ ఉంటారుమెగా అభిమానులు. ఇక శ్రీకాంత్ చిరంజీవిని అన్నయ్య అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు. కాగా వీరిద్దరి మధ్య స్నేహం మామూలుగానే మెగా అభిమానులను తెగ ఆకర్షిస్తూ ఉంటుంది.... అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వచ్చింది అంటే ఇక మెగా అభిమానులు అభిమానులు మురిసిపోతూ ఉంటారు. 

 

 

 అయితే వీరిద్దరూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒకరికొకరు ఎప్పుడు ఆప్యాయంగా పలకరించుకొంటూనే ఉంటారు. కాగా టాలీవుడ్ లో సీనియర్ హీరోల మధ్య ఉన్న స్నేహబంధం లో వీరిద్దరిది కూడా ఒకటి. శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ స్టేజ్ మీద కనిపించిన వీరి మధ్య జరిగే సంభాషణలు వీరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని ఆప్యాయతను గుర్తు చేస్తూ ఉంటుంది . అందుకే అటు మెగా అభిమానులకు కూడా వీరిద్దరి స్నేహం ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: