తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది సినీ హీరోలు ఎన్నో ఏళ్ల నుంచి స్నేహితులుగా కొనసాగుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా మంచి స్నేహితులుగా కొనసాగుతున్న వారు ఉన్నారు అనే విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రేక్షకులకు బాగా దగ్గరైన స్నేహితుల్లో  ప్రభాస్ గోపీచంద్ ఇద్దరు ఉంటారు. వీరిద్దరూ ఎన్నో ఏళ్ల నుంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. వీరిద్దరి మధ్య స్నేహబంధం కూడా ఎంతో ఆప్యాయంగా ఉంటుంది. ఒకరి కోసం ఒకరు ఏం చేయడానికైనా సిద్ధపడే ఉంటాయి. మామూలుగానే ప్రభాస్ ఎప్పుడు అందరితో నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.. అదే తన స్నేహితుడైన గోపీచంద్ తో అయితే పంచుల వర్షం కురిపిస్తూ ఉంటాడు.

 

 

 ఇప్పటికే ఈ  ఇద్దరు స్నేహితులు కలిపి వర్షం అనే సినిమాలో  నటించిన విషయం తెలిసిందే. ఈ  సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ విషయాన్ని అందుకుంది. అయితే వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తే గోపీచంద్ విలన్గా నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో విలన్ గా నటించిన గోపీచంద్ హీరోగా మారిపోయాడు. ఇద్దరు స్నేహితులు ఎన్నోసార్లు తెర మీద కనిపిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు అని చెప్పాలి.

 

 

 ఇక వీరిద్దరూ కలిసినప్పుడల్లా ఇంత స్టైల్ గా ఉన్నావ్ ఏంటి... బాడీ ఇలా ఉంది ఏంటి... ఏం తింటావు అంటూ గోపీచంద్ పై పంచుల వర్షం కురిపిస్తూ ఉంటాడు ప్రభాస్. ఇక ప్రభాస్ మాట్లాడుతున్నంత సేపు గోపీచంద్ నవ్వుతూనే ఉంటాడు. ఇలా వీరిద్దరి బంధం ఎంతో అపురూపంగా ఉంటుంది. ఇక ప్రభాస్ తన స్నేహితుడైన గోపీచంద్ పై తే అమితమైన ప్రేమను చూపిస్తూ ఉంటాడు. ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు రెబల్ స్టార్ ప్రభాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: