బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి, ఆ సినిమా తర్వాత అన్నీ లేడీ ఓరియంటెడ్ సినిమాలే ఒప్పుకుంటుంది. బాహుబలి తర్వాత వచ్చిన భాగమతి సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. దాంతో మరో సినిమాకి పచ్చా జెండా ఊపింది. అదే నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా కనిపించనుంది. 


సినిమా మొత్తం అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంది. అన్నీ సరిగ్గా కుదిరితే ఈ పాటికే సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగ ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సిన చిత్రం వాయిదా పడింది. ఇక అప్పటి నుండి నిశ్శబ్దం సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని, నిర్మాతకి భారీ ఆఫర్ వచ్చిందని, మరికొద్దిరోజుల్లో అమెజాన్ ప్రైమ్ లో రానుందని జోరుగా ప్రచారం జరిగింది. చిత్ర దర్శకుడు కూడా ఈ విషయమై సరిగ్గా స్పందించకపోవడంతో నిశ్శబ్దం ఓటీటీలో రావడం లాంచనమే అనుకున్నారు.

 

కానీ ఈ చిత్ర నిర్మాత కోనవెంకట్ డైరెక్టుగా థియేటర్లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు కోనవెంకట్ తెలిపాడు. కోన వెంకట్ ట్వీట్ చేస్తూ, మేమంతా సినిమా ఇండస్ట్రీకి ఎంతో ఇష్టపడి వచ్చాం. ఎంతో కష్టపడి ఇక్కడ నిలదొక్కుకున్నాం . సినిమాలు రూపొందించేది థియేటర్లలో చూడడానికే. అక్కడ రిలీజ్ చేస్తేనే మాకు ఆనందం కలుగుతుంది. అదే మాకు అతిపెద్ద ఆక్సిజన్ లా పనిచేస్తుంది. సినిమా అంటే థియేటరే అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ దెబ్బతో నిశ్శబ్దం ఓటీటీలో వస్తుందన్న వార్తలకి ఫుల్ స్టాప్ పడింది.

 

అయితే థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి, వారి నిర్ణయాల్లో ఏమైనా మార్పులుంటాయేమో చూడాలి. థియేటర్లు తెరుచుకునేంత వరకూ కోనవెంకట్ తన మాటకి కట్టుబడి ఉంటాడా అన్నది చూడాలి. అయితే ఈ సినిమాని థియేటర్లలో చూడడానికే ఆసక్తి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: