నందమూరి తారక రామారావు 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాతో బాలనటుడిగా వెండితెరకు పరిచమయ్యాడు. ఆ తర్వాత 'రామాయణం' సినిమాతో బాల రాముడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'నిన్ను చూడాలని' అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ద్వారా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నూనూగు మీసాల వయసులోనే 'స్టూడెంట్ నెంబర్ 1' 'ఆది' 'సింహాద్రి' సినిమాలతో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ మూవీస్ కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. 'బృందావనం' సినిమా తర్వాత తారక్ హిట్ కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 'టెంపర్' సినిమా నుంచి కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వైవిధ్యమైన పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడిగా.. హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరిగా నిలిచారు. 


ఇదిలా ఉండగా యంగ్ హీరో నారా రోహిత్‌లో దాగి ఉన్న కళ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బయటికి వచ్చింది. అవును ఇప్పటి వరకు చాలా సైలెంట్‌ గా తన పని తాను చేసుకుపోయే నారా రోహిత్‌లో ఇంత గొప్ప టాలెంట్ ఉన్న విషయం ఎవరికీ తెలియదు. ఇంతకీ ఏమా టాలెంట్ అనుకుంటున్నారు కదా. ఇటీవల ట్విట్టర్ ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్.. రాబోయే తారక్ బర్త్‌ డే‌కి అందరికీ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇస్తానని మాటిచ్చిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే నారా రోహిత్ అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు. ''వారెవరో చెప్పినట్లు పదాలలో వ్యక్తపరచలేని విషయాలు కళ ద్వారా వ్యక్తీకరించబడతాయి అంటారు కదా. తారక్.. మీకు అలాగే మీ అభిమానులకు నా ఈ చిన్న కానుక. పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్'' అని ట్వీట్‌లో పేర్కొన్న నారా రోహిత్.. తనే స్వయంగా వేసిన ‘అరవింద సమేత’ చిత్రంలోని మొండికత్తిని పట్టుకున్న ఎన్టీఆర్ షర్ట్ లెస్ పిక్‌ను జతచేశారు. ఈ ట్వీట్ చూసిన తారక్ ఫ్యాన్స్ అందరూ నారా రోహిత్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: