డేవిడ్ వార్నర్ స్టేడియంలోనే కాదు.. థియేటర్లలోనూ సిక్స్ లు కొట్టడానికి ప్రిపేర్ అవుతున్నాడా.. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అతి త్వరలోనే ఇండియన్ స్క్రీన్ పై మెరవబోతున్నాడా.. అంటే టిక్ టాక్ ల సాక్షిగా అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ క్రికెటర్ త్వరలోనే ఇండియన్ మూవీస్ లో కనిపించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. 

 

నెట్ ప్రాక్టీసులు, టోర్నమెంట్స్ తో బిజీగా ఉండే డేవిడ్ వార్నర్, ఈ మధ్య టిక్ టాక్ లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. లాక్ డౌన్ తో వచ్చిన బ్రేక్ ను టిక్ టాక్ తో స్పెండ్ చేస్తున్నాడు. బాలీవుడ్ నుంచి మొదలుపెడితే టాలీవుడ్ వరకు సూపర్ హిట్ సాంగ్స్ కు డ్యాన్సులు వేస్తున్నాడు. బాహుబలి డైలాగ్ లు చెబుతున్నాడు. మొత్తంగా ఇండియన్ ఆడియన్స్ కు ఫుల్ గా రీచ్ అవుతున్నాడు వార్నర్. 

 

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపుతో కీలకపాత్ర పోషించిన వార్నర్ కు భారత్ లో మంచి గుర్తింపు ఉంది. ఇక తెలుగు ప్రేక్షకుల్లో అయితే క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు టిక్ టాక్ తో ఈ ఫాలోయింగ్ మరింత పెరుగుతోంది. దీంతో వార్నర్ ఇక్కడ సినిమాల్లో నటించినా.. ఆశ్చర్యపోనక్కర్లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

 

ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ కూడా ఇంతకుముందు ఓ బాలీవుడ్ సినిమాలో నటించాడు. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలోనే షూటింగ్ జరుపుకున్న అన్ ఇండియన్ అనే హిందీ మూవీలో హీరోగా నటించాడు నటించాడు లీ. ఇప్పుడు వార్నర్ కూడా ఇలాగే ఇండియన్ సినిమాలో మెరిసే అవకాశముందని చెబుతున్నారు. అయితే బ్రెట్ లీ కెరీర్ ఎండింగ్ లో ఉన్నప్పుడు కెమెరా ముందుకొచ్చాడు. కానీ వార్నర్ ఇప్పుడు పీక్స్ లో ఉన్నాడు. నిషేధం తర్వాత అన్ని ఫార్మాట్స్ లో అదరగొడుతున్నాడు. మరి ఈ స్టేజ్ లో వార్నర్  సినిమాల్లోకి వస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: