తెలుగు చిత్ర పరిశ్రమ లో  తెలుగు హీరోల సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా బాగా ఆడతాయి అన్న విషయం తెలిసిందే. అందుకే తమిళ హీరోలు తెలుగులో కూడా తమ సినిమాలను విడుదల చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే అటు తమిళంలో నే కాదు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా మంచి వసూళ్ళు రాబడుతు ఉంటాయి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో భాషల సినిమాలు డబ్బింగ్ అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. తమిళ్, కన్నడ మలయాళ హిందీ భాషలకు సంబంధించిన సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటూ వుంటాయి. ఇలా ఇప్పటివరకు చాలానే సినిమాలు తెర మీదికి వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. 

 

 ఇలా వచ్చిన సినిమాల్లో కమల్ హాసన్ కు మంచి విజయాన్ని అందించిన సినిమా దశావతారం. విలక్షణ నటుడు కమల్ హాసన్ మామూలుగానే ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి మరి  నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తు  ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయితే కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం దశావతారం. అయితే తమిళ డబ్బింగ్ మూవీ అయినప్పటికీ తెలుగులో దశావతారం సినిమా ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. 

 


 ఇక దశావతారం సినిమాలో... కమలహాసన్ లోని మరో స్థాయి నటుడు కనిపించాడు అనే చెప్పాలి. మామూలుగానే కమలహాసన్ ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు.. దశావతారం సినిమాలో కూడా కమల్ హాసన్ పాత్రలో ఒదిగిపోయి నటించారు. కానీ అది ఒక పాత్ర కాదు ఏకంగా పది పాత్రలు. డిఫరెంట్ మ్యానరిజం... డిఫరెంట్ స్టైల్.. డిఫరెంట్ ఆటిట్యూడ్ తో కూడిన  10 పాత్రలను కమలహాసన్ ఒకే సినిమాలో పోషించారు. ఇలా కమల్హాసన్ పది పాత్రల్లో నటించడంతో అటు  తెలుగు ప్రేక్షకులను ఫిదా అయిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: