టీమిండియా డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ విరాట్ కోహ్లీ సతీమణి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిర్మాత అయిన అనుష్క శర్మ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు హీరోయిన్గా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతునే  మరోవైపు నిర్మాతగా కూడా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. అయితే తాజాగా అనుష్క కు సంబంధించిన ఓ వెబ్ సిరీస్ అనుష్కను వివాదాల్లోకి నెట్టింది. తాజాగా అనుష్క శర్మ పై గుర్జా  కమ్యూనిటీ గ్రూప్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. తాజాగా పాతల్ లోక్  వెబ్ సిరీస్ విడుదలై అందరినీ ఆకర్షిస్తు ట్రెండింగ్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ లో తమను కించపరిచే విధంగా వివక్షాపూరిత సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ ది  అరుణాచల్ ప్రదేశ్ గుర్జా యూత్ అసోసియేషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. 

 


 ఈ విషయం గురించి భారతీయ గుర్జా పరిసంగ్  అధ్యక్షుడైన నందా  కిరాటీ దేవన్ మాట్లాడుతూ.. పాతాల్ లోక్ వెబ్ సిరీస్ లో గుర్జా  కమ్యూనిటీని అవమానించే విధంగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని... సమాజంలో తమకున్న ప్రతిష్టను దిగజార్చేలా ఆ సన్నివేశాలు ఉన్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు సన్నివేశాలు ప్రసారం అవుతున్నప్పుడు... మ్యూట్లో పెట్టి... సబ్ టైటిల్స్ వచ్చేలా ఎడిట్ చేసి  అప్లోడ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయ పోరాటం చేస్తామంటూ తెలిపారు. అంతేకాకుండా మేఘాలయ కాశీ తెగకు చెందిన ఓ యువతి... ఆన్లైన్లో ఈ వెబ్ సిరీస్ ను తప్పుబడుతూ పిటిషన్ దాఖలు చేసింది. పాతాల్ లోక్  వెబ్ సిరీస్ లో మహిళలను అసభ్యంగా దూషిస్తూ అసభ్యకర పదజాలంతో ఉపయోగించారు అంటూ ఆరోపించింది ఆ యువతి. 

 

 వెబ్ సిరీస్ లోని సెకండ్ ఎపిసోడ్ లో ఈ మేరకు సన్నివేశాలు ఉన్నాయంటూ తెలిపిన ఆ యువతి... మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్న ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలంటూ కోరింది. కాగా ఈ సినిమా అనుష్క శర్మ నిర్మాణంలో వచ్చిన విషయం తెలిసిందే. అవినాష్ - ప్రోసిత్  డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ఒరిజినల్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్ గా సాగిపోయే ఈ వెబ్ సిరీస్ మొత్తం తొమ్మిది ఎపిసోడ్లు ఉంటుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో క్రైమ్ థ్రిల్లర్ తో పాటు భారతీయ సమాజంలో చీకటి కోణాన్ని స్పృశించేలా ఉంది అంటూ ప్రస్తుతం ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది ఈ వెబ్ సిరీస్. అదే సమయంలో అనుష్క శర్మను పలు వివాదాల్లో కి కూడా నెడుతుంది. మరి దీనిపై అనుష్కశర్మ ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: