ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు. తాతల కాలం నుంచి నేటి వరకు అక్కినేని ఫ్యామిలీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇప్పటికీ అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడు తరాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే అక్కినేని ఫ్యామిలీలో నటసామ్రాట్ గా ఎదిగి ఎంతగానో  గుర్తింపు తెచ్చుకున్న నాగేశ్వరావు... యువ సామ్రాట్ గా తనదైన నటనతో ఆకట్టుకున్న నాగార్జున... ప్రస్తుతం యువ హీరోలు గా కొనసాగుతున్న నాగచైతన్య అఖిల్ లు  వీరందరూ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. దశాబ్ధాల కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది అక్కినేని ఫ్యామిలీ. 

 

 అయితే అటు నాగేశ్వరరావు కానీ ఆయన కొడుకు నాగార్జున స్టార్ హీరోలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నప్పటికీ తమ సొంత ఊరు మాత్రం ఎప్పుడూ మరచిపోలేదు. నాగార్జున తండ్రి నాగేశ్వరరావు సొంతూరు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా రామాపురం. రామాపురంలో జన్మించారు నాగేశ్వరరావు. అయితే మొదటి నుంచి నాటకాలపై ఎంతో ఆసక్తి ఉండే నాగేశ్వరరావు ఆ తర్వాత మద్రాసు వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక నాగేశ్వరరావు స్టార్ హీరో గా ఉన్న సమయంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు చెందినటువంటి కొడాలి వారి ఆడపడుచు అన్నపూర్ణమ్మ తో వివాహం జరిగింది. 

 


 ఇక వీరికి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే స్టార్ హీరోగా ఎదిగిన నాగేశ్వరరావు మద్రాసులో స్థిరపడ్డారు. ఆ తర్వాత నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో నాగార్జున హీరోగా పరిచయమై స్టార్ హీరోగా ఎదిగారు. ఇక అక్కినేని ఫ్యామిలీ మూడవతరం... నాగేశ్వరరావు మనవళ్లు కూడా హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే స్టార్ హీరోగా ఎదిగిన నాగేశ్వరరావుకూ  సొంతూరు పై మమకారం ఎంతో  ఉండేది. తర్వాత నాగార్జున కూడా నాగేశ్వరరావు స్మారకార్థం తన సొంతూరు రామాపురం లో ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగిన నాగేశ్వరరావు నందమూరి తారక రామారావు.. ఒకే జిల్లాకు చెందినవారు చాలా దగ్గరగా ఊర్లలో  ఉన్న వారు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: