జస్టీస్ చౌదరి... ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు ఎన్టీఆర్ అభిమానులు. ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఆయన చేసిన ఈ సినిమా గురించి బాలీవుడ్ కూడా మాట్లాడుకుంది. ఈ సినిమాలో ఉండే పాటల నుంచి ప్రతీ ఒక్కటి కూడా ఇంకా ప్రేక్షకుల చెవుల్లో వినపడుతూనే ఉన్నాయి అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ని కొన్ని వర్గాల ప్రేక్షకులు ప్రత్యేకంగా ఆదరించారు. ఎన్టీఆర్ డైలాగులకు ఎన్టీఆర్ నటనకు సినిమా హాల్ లోనే పూలు జల్లారు. 

 

సినిమా హాల్ నుంచి బయటకు రాకుండా నాలుగు షో లు ఏకదాటి గా చూసిన ప్రేక్షకులు కూడా ఉన్నారని అంటారు. ఆ విధంగా ఈ సినిమా హిట్ అయింది అప్పట్లో. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన చూసిన వాళ్ళు అయితే ఆయనను దేవుడు అన్నారు. ఇక ప్రతీ సన్నివేశం లో కూడా ఎన్టీఆర్ చాలా బాగా నటించారు. ప్రతీ సన్నివేశం కూడా ఇప్పటికి ఇంకా కళ్ళ ముందే ఉంది. టీవీ లో సినిమా వస్తుంది అంటే ఆయన అభిమానులతో పాటు గా అందరి అభిమానులు కూడా ప్రత్యేకంగా చూసే వారు అనేది వాస్తవం. 

 

ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ అలాగే విలన్ ల నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమాలో రావు గోపాల్ రావు విలన్ గా నటించారు. అలాగే మరి కొందరు కూడా సినిమాలో చాలా బాగా నటించి మెప్పించారు. ఆ సినిమా తర్వాత ఆయన తో ఒక్క సినిమా చేసినా సరే చాలు అనుకున్నారు కొందరు. ఆ విధంగా ఆ సినిమా మెప్పించింది ప్రేక్షకులను. నిర్మాతకు కూడా మంచి వసూళ్లు వచ్చాయి ఆ సినిమాకు. అలా హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: