టాలీవుడ్ లో బెస్ట్ హీరో దర్శకుడి కాంబినేషన్ అనగానే చాలా మంది చెప్పే మాట రాఘవేంద్ర రావు ఎన్టీఆర్. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులకు ఒక రకంగా పండగ అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. ఎన్టీఆర్ సినిమాలకు ఆయన తో చేసిన తర్వాత ఇండియన్ లెవెల్ లో క్రేజ్ పెరిగింది అని అంటారు. ఆ విధంగా వారి కాంబినేషన్ ప్రేక్షకులకు అలా గుర్తుంది. ఎన్టీఆర్ సినిమాలను ఆ సినిమా తర్వాత ఆదరించి పిల్లలకు సినిమాల్లో పేర్లను కూడా పెట్టుకున్నారు అనేది వాస్తవం. ఇప్పటికి ఆ పేర్లు వినపడుతూనే ఉంటాయి. 

 

అటు తమిళనాడు లో కూడా వీరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉండేది. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో రికార్డులు సృష్టించిన సినిమా వేటగాడు. ఈ సినిమా కోసం తమిళనాడు నుంచి ఆంధ్రా కూడా వచ్చి చూసారు ప్రేక్షకులు అనేది అప్పట్లో చాలా మంది చెప్పారు ఆ సినిమా లో ఎన్టీఆర్ నటన చూసిన ప్రేక్షకులు ఇప్పటికి కూడా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్తారు. దర్శకుడి ఆలోచనకు తగిన విధంగా ఆయన ఆ సినిమాలో నటించారు అనేది వాస్తవం. ఆ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టడమే కాదు ఎన్టీఆర్ రేంజ్ ని అమాంతం పెంచాయి అనేది చెప్పవచ్చు .

 

ఇక అక్కడి నుంచి కూడా ఎన్టీఆర్ చేసే సినిమాలకు ఒక క్రేజ్ అనేది తెలుగులో బాగా వచ్చింది. హీరోలు కూడా ఆయన సినిమా చూడటానికి హాల్ కి వెళ్ళిన సందర్భం కూడా ఉందని ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. ఆయనను ఆదరించారు దండాలు పెట్టారు ఆయన సినిమా కోసం పూలు జల్లారు. వేటగాడు సినిమా గురించి ఇప్పుడు అడిగినా సరే ప్రత్యేకంగా చెప్తూ ఉంటార్ ఎన్టీఆర్ అభిమానులు. ఆ విధంగా ఆ సినిమా హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: