తెలుగు సినిమాలో అయినా మరో చోట అయినా సరే ఎన్టీఆర్ అనగానే చాలా మందికి ఒక ఎనర్జీ. ఆయన పేరు వింటే చాలు చాలా మంది కి ఇప్పటికి ఒక పిచ్చి అని అంటూ ఉంటారు. ఎన్టీఆర్ సినిమాలు ఎన్టీఆర్ రాజకీయం తలవని వారు ఉండరు. ఆయన స్ఫూర్తి తో ముందుకి వెళ్ళని వారు కూడా ఉండరు. ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకునే వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉన్నారు. అసలు ఆయన సినిమాల్లోకి రావడానికి ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానమే చాలా వరకు కారణం అని అంటూ ఉంటారు. ఎన్టీఆర్ ని చూసి ఆయన నిజంగా స్ఫూర్తి పొందారు అని అంటారు. 

 

ఎన్టీఆర్ కూడా కృష్ణ ను సినిమాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అభిమానించారు అని అంటూ ఉంటారు. ఎన్టీఆర్ చేసిన రాజకీయంలో మాత్రం కృష్ణ ఇబ్బంది పడ్డారు గాని ఎన్టీఆర్ అంటే ఇప్పటికి కూడా కృష్ణ కు ప్రత్యేక అభిమానం అని అంటూ ఉంటారు. ఎన్టీఆర్ తో వచ్చిన కొన్ని విభేదాల కారణంగా తెలుగుదేశం పార్టీలో చేరాలి అనుకున్న కృష్ణ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారని అంటారు. ఎన్టీఆర్ అంటే కృష్ణ కు అభిమానం ఉన్నా సరే కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా ఇద్దరి మధ్య దూరం అనేది పెరిగింది అని అంటూ ఉంటారు. అయినా సరే అవి తర్వాత సర్దుకున్నాయి అని అంటారు. 

 

ఎన్టీఆర్ కూడా ప్రతీ విషయంలో చాలా వరకు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా వ్యవహరించే వారు అని కాని కృష్ణ లో మాత్రం చాలా వరకు దూకుడు ఉండేది అని అంటూ ఉంటారు. కృష్ణ చేసిన రాజకీయాలు కూడా ఎన్టీఆర్ కి అసలు నచ్చేవి కాదని అయినా సరే వివాదాలను ఎప్పుడు కూడా పెద్దవి చేసుకోలేది అని కృష్ణ చెప్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: