మహానటి సావిత్రి... తెలుగు సినిమా అయినా తమిళ సినిమా అయినా సరే హీరోయిన్ అనగానే ఆమె పేరు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆమె పేరు లేకుండా హీరోయిన్ కి నటన సలహాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. ఆ విధంగా ఆమె మన సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇక ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్టీఆర్ గురించి కూడా చెప్పుకోవాలి. సావిత్రి ని ఎన్టీఆర్ ప్రత్యేకంగా అభిమానించే వారు అని దగ్గరగా చూసిన వారు చెప్తూ ఉండే మాట. 

 

ఎన్టీఆర్ కు ఆమె అంటే యెనలేని అభిమానం అని చెప్పే వారు చాలా మందే ఉన్నారు. ఎన్టీఆర్ ని కూడా సావిత్రి ప్రత్యేకంగా అభిమానించి తన వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాలను ఆమె చెప్పుకునే వారు అని  అలాగే జెమిని గణేషన్ తో ఉన్న ప్రేమ వ్యవహారాన్ని కూడా ఆమె చెప్పుకున్నారని అప్పుడు ఎన్టీఆర్ ఆమెకు సలహాలు ఇచ్చారని అంటారు. కాని ఆమె ముందుకు వెళ్ళాక తప్పని పరిస్థితి ఏర్పడింది అని అంటూ ఉంటారు. ఎన్టీఆర్ ఆమెకు ఆర్ధికంగా ఒకానొక సమయంలో అండగా కూడా నిలవాలి అని ప్రయత్నం చేసారని అంటారు. 

 

ఆమె జీవితం అలా అయినందుకు ఎన్టీఆర్ చాలా బాధ పడ్డారు అని అంటారు. ఎన్టీఆర్  కి ఆమె చివర్లో దూరం అయ్యారు. హీరో హీరోయిన్ లు గా చేసినా సరే అన్నా చెల్లెళ్ళు గా ఇద్దరూ ఉండే వారు అని అంటారు. అందుకే ఎన్టీఆర్ కూడా ఆమె విషయంలో ప్రత్యేక అభిమానం చూపించే వారు అని అంటారు. ఎన్టీఆర్ కెరీర్ లో ఆమె తో చాలా సినిమాలు చేసారు. ఆమెతోనే ఆయన ఎక్కువగా సినిమాలు చేసారు. ఆ సినిమాల్లో ఒక రేంజ్ లో హిట్ అయిన సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: