మన తెలుగులో నటిగా మంచి పేరు తెచ్చుకుని ఒక వెలుగు వెలిగిన వ్యక్తి సావిత్రి. హీరోయిన్ గా ఆమె ప్రస్తానం నిర్మాతగా ఆమె చేసిన సినిమాలు నటిగా ఆమెకు వచ్చిన పేరు ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలోనే ఎవరికి కూడా రాలేదు. ఇండియన్ సినిమాలో మొదటి లేడీ సూపర్ స్టార్ సావిత్రి అనేది వాస్తవం. ఆమెను చూసి సినిమాల్లోకి వచ్చిన హీరోయిన్ లు ఉన్నారు. ఆమేము చూసి ఆమె సినిమాలను చూసి నటన నేర్చుకున్న వారు ఎందరో ఉన్నారు అనేది వాస్తవం. ఆ విధంగా ఆమె అంత తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. 

 

ఆమె చేయని సినిమా ఆమె కు రాని పేరు అనేది లేదు. అగ్ర హీరోలు ఆమె సినిమాల కోసం అప్పట్లో ఎదురు చూసే పరిస్థితి ఉండేది అనే మాట అక్షరాలా నిజం. ఎంత స్టార్ హీరో అయినా సరే ఆమె తో సినిమా చేస్తే కచ్చితంగా స్టార్ హీరో గానే కాదు ఆయనకు మంచి పేరు వస్తుంది అనే  విధంగా ఉండే వారు అని చెప్తారు. ఆ విధంగా సావిత్రి ప్రాధాన్యతను చాటుకున్నారు. ఇక ఆమె సినిమాలు  గురించి పక్కన పెడితే ఆమెకు చాలా విలువ టాలీవుడ్ లో గాని తమిళంలో గాని ఉండేది అని చెప్తూ ఉంటారు. తమిళ సినిమాల్లో కూడా ఆమె మాటను కాదు అని ఏదీ చేసే వారు కాదు అని అంటారు. 

 

ఆమెకు తెలుగులో చాలా ప్రాధాన్యత అనేది దక్కింది అనే చెప్పాలి. తెలుగు వారు కూడా ఆమె స్థాయిని ఎక్కడా తగ్గించే విధంగా ప్రవర్తించడం గాని ఆమె ను ఎక్కడ అకుడా... తక్కువ చేసి చూసే విధంగా గాని ప్రవర్తించిన సందర్భం అనేది లేదు అని చెప్పవచ్చు. ఆ విధంగా సావిత్రి పేరు తెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: