సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చర్చల దశలోనే ఆగిపోతుంటాయి. మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగా నిలిచిపోతాయి. ఇంకొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నా విడుదలకు నోచుకోక అలా మిగిలిపోతాయి. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో.. అసలు రిలీజ్ అవుతాయో లేదో కూడా చెప్పలేము. అలాంటి వాటిలో రెండు క్రేజీ మూవీస్ యాక్షన్ హీరో గోపీ చంద్ నటించిన ''ఆరడుగుల బులెట్'' మరియు మంచు హీరో విష్ణు నటించిన ''సరదా''. మరి ఈ సినిమాలు రిలీజ్ కి నోచుకోకపోవడానికి ఇవేమైనా చిన్న సినిమాలా అంటే అదీకాదు. స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో హీరోయిన్స్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమాలకి వర్క్ చేసారు. మాస్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ - నయనతార హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా ''ఆరడుగుల బులెట్''. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాని తాండ్ర రమేష్ నిర్మించారు. 2017లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని అనేక వాయిదాల తర్వాత 2017 జూలై 16న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. వాల్ పోస్టర్స్ కూడా అంటించారు. రిలీజ్ రోజు ప్రేక్షకులు థియేటర్స్ కి కూడా చేరుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ బొమ్మ స్క్రీన్ మీద పడలేదు. ఇప్పటికి మూడేళ్లు అవుతున్నా ఈ సినిమా గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు.

 

aaradugula bullet may not release june 9th Police Case by NRI on ...

 

ఇక మంచు విష్ణు - సోనారికా బడోరియా హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ''సరదా''. ఈ సినిమాకి జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహించగా కుమార్ మరియు కేశవ్ రావు లు నిర్మించారు. ఈ సినిమాకి మొదట 'సరదా అబ్బాయి' అనే టైటిల్ పెట్టారు. ఆ తర్వాత ''సరదా'' గా మార్చారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన 2016లో రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమా కంప్లీట్ అయి నాలుగు సంవత్సరాలు అవుతున్నా 'సరదా' జాడే లేదు. ఇలాంటి మూవీస్ టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. నేడు డిజిటల్ వరల్డ్ లో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ హవా స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. అందరూ ఈ ఓటీటీలలో వచ్చే సినిమాలు చూడటానికే ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్స్ దాకా ఏమి వెళ్తాములే.. ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో సినిమా చూసేయొచ్చు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలా రిలీజ్ కి నోచుకోని సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తే నిర్మాతలు అంతో ఇంతో నష్టాల నుండి బయటపడే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పటికైనా రిలీజ్ కి నోచుకోని సినిమాలు ఓటీటీల ద్వారా అయినా బయటకి వస్తాయేమో చూడాలి. 

 

Sarada (2016 film) - Wikipedia

మరింత సమాచారం తెలుసుకోండి: