ప్రపంచ వ్యాప్తంగా కంటికి కనిపించని ఒక మహమ్మారి సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. ప్రపంచం మొత్తాన్ని గుప్పిట పట్టి పీడిస్తోన్న కంటికి కనిపించని సూక్ష్మజీవికి అన్ని దేశాలు కుదేలైపోతున్నాయి. దీని ప్రభావం మన దేశం మీద కూడా గట్టిగానే పడింది. దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని నివారణ కోసం ఇప్పటికే తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూ వస్తున్నాయి. సినీ ప్రముఖుల కుటుంబాలు కూడా దీని బారిన పడ్డారు. ఇప్పటికే బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సింగర్ కనిక కపూర్.. నిర్మాత కరీం మోరాని ఆయ‌న‌ ఇద్దరు కూతుళ్ళు.. విల‌క్షణ నటుడు ఫ్రెడీ తండ్రి.. బాలీవుడ్ నటుడు సత్యజిత్ తల్లి.. బోని క‌పూర్ ముగ్గురు స‌హాయ‌కులు దీని బారిన పడ్డారు. ఈ క్రమంలో బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా పేరు పొందిన కిరణ్ కుమార్‌ కు పాజిటివ్‌ వచ్చినట్టుగా వైద్యులు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కిరణ్ కుమార్ కరోనా బారినుండి బయటపడి కోలుకున్నారు.

 

ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు. ''దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది.. ఈ క్రమంలో వైరస్ సోకిన వారిని వెలివేసినట్లు ప్రవర్తించడం సరైన విధానం కాదని'' నటుడు కిరణ్ కుమార్ అన్నారు. ఈ వైరస్ మనతోపాటు కలిసే జీవిస్తుందని, దీన్ని పూర్తిగా నాశనం చేయడం కష్టసాధ్యమని చెప్పారు. అయితే ఈ వైరస్‌ కారణంగా భయాందోళనలు చెందవలసిన అవసరం లేదని తెలిపారు. సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్‌ను నియంత్రించవచ్చని.. అంతేగానీ సోషల్ బాయ్‌ కాటింగ్ చేయడం మాత్రం తగదని సూచించారు. 'కరోనా సోకడం నేరమేం కాదు. మనకు తెలిసిన వారికి వైరస్ సోకి సెల్ఫ్ ఐసోలేషన్‌ లో ఉంటే మనం వారికి అండగా ఉండాలి. అంతేగానీ వారిని వెలివేయకూడదు' అని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. కాగా 74 ఏళ్ళ కిరణ్ కుమార్‌ బుల్లి తెరపై వెండి తెరపై చెరగని ముద్ర వేసుకున్నారు. తన జీవితంలో దాదాపు 50 ఏళ్లకు పైగా యాక్టింగ్ చేస్తూ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: