మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - నటసింహ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహా' 'లెజెండ్' సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా నమ్మకంతో ఉన్నారు. ఈ  సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అయితే అందులో ఒక పాత్ర అఘోర పాత్ర. దీని కోసం రెండు రకాల గెటప్పులు డిజైన్ చేసినట్టు సమాచారం. త్వరలో ఆ రెండు గెటప్పులతో బాలయ్యకు మేకప్‌ టెస్ట్‌ లు చేసి అందులో ఒక గెటప్పుని ఫైనల్ చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడట. తాజాగా ఈ చిత్రానికి ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే ఈ వార్తల పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

 

అయితే ఇప్పుడు 'మోనార్క్' సినిమాలో బాలయ్య గెటప్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ పోస్టర్ హల్ చల్ చేస్తోంది. బాలయ్య అఘోరా గెటప్ లో 'మోనార్క్' సినిమా టైటిల్ తో ఈ పోస్టర్ డిజైన్ చేయబడింది. ఈ పోస్టర్ లో బాలయ్య కనిపిస్తున్న లుక్ ని మించి రిలీజ్ చేయబోయే ఆఫీసియల్ పోస్టర్ ఉండబోతోందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. జూన్ 10 కోసం నందమూరి అభిమానులు ఆతృతగా వెయిట్ చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉండగా ఒక హీరోయిన్ గా తెలుగమ్మాయి అంజలిని అనుకుంటున్నారట. వీరిద్దరూ గతంలో 'డిక్టేటర్' సినిమాలో కలిసి నటించారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేశామని బాలయ్య తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ షెడ్యూల్ లో వీరి కాంబోలో వచ్చిన గత చిత్రాల లాగే ఒక పవర్ ఫుల్ ఫైట్ ని షూట్ చేశామని.. ఆ ఫైట్ సినిమాకి హైలైట్ అవుతుందని బాలయ్య వెల్లడించారు. షూటింగులకు అనుమతి లభించిన వెంటనే ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్ కాబోతోంది. 

 

The Visualized Social Media Search

మరింత సమాచారం తెలుసుకోండి: