టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా ఎక్కడ అయినా సరే బాహుబలి సినిమా సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో ఉండే కొన్ని సీన్స్ ని చూసి హాలీవుడ్ కూడా షాక్ అయింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరో పాత్ర విలన్ పాత్ర వారి నటన అన్ని కూడా చాలా బాగా ప్రపంచ సినిమాను ఎంతగానో ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. చిన్న చిన్న సీన్ లు కూడా ప్రేక్షకులను ఎంత బాగానో మెప్పించాయి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు మాత్రం వివాదాల చుట్టూ తిరిగాయి అనేది తెలిసిందే. 

 

ఫైట్ లో వాడే కొన్ని యంత్రాలు ఎక్కడి నుంచో కాపీ కొట్టారు అని కొందరు అన్నారు. అదే విధంగా కొన్ని సీన్స్ ని హాలీవుడ్ సినిమాల నుంచి దర్శకుడు కాపీ కొట్టాడు అనే విమర్శలు చాలానే వచ్చాయి అప్పట్లో. అయినా సరే దర్శకుడు వివాదం లేకుండా సినిమాను ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేసారు. రెండో భాగం విషయంలో కూడా వివాదాలు కాస్త చికాకు పెట్టాయి. కొన్ని కొన్ని సన్నివేశాలు చిరాకుగా ఉన్నాయి అన్నారు. ఇక అడవి జంతువులను ఏదో ఇబ్బంది పెట్టారు అనేది కూడా కొన్ని వివాదాలు వచ్చిన సంగతి తెలిసిందే.

 

ఏది ఎలా వచ్చినా సరే ఈ సినిమా మాత్రం తెలుగు సినిమాలో ఒక రేంజ్ సంచలనం అనేది వాస్తవ౦. ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ప్రతీ సేన్ ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమా వసూళ్లను చూసి బాలీవుడ్ కూడా షాక్ అయింది అని చెప్పవచ్చు. ఆ విధంగా బాహుబలి ఒక సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: