పూనమ్ కౌర్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కు, పూనమ్‌కు ఏదో ఎఫైర్ ఉందని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. దానిపై ఆమె కూడా ఎప్పుడూ కాదని స్పందించలేదు.. అవునని ఒప్పుకోలేదు.
అయితే పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న రహస్య బంధం ఏంటో ఎవరికీ తెలియదు కాని.. పూనమ్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ అవుతూ ఉంటారు.
అందుకు పరోక్షంగా పూనమ్ చేసే వ్యాఖ్యలు కావొచ్చని అనేవారు చాలామందే ఉన్నారు. అయితే గతకొంత కాలం నుంచి పూనమ్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్‌లని టార్గెట్ చేస్తుందంటూ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే అది నిజమే అంటూ పూనమ్ తేల్చేసింది. ఎలా అంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రోజా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గుండు విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అప్పుడు గుండు కొట్టించింది టీడీపీయే, 2014లో గుండు కొట్టించింది టీడీపీయే, 2019 ఎన్నికల్లో కొట్టించబోయేది టీడీపేనని సెటైర్స్ వేసింది. దీంతో పవన్ కళ్యాణ్ గుండు వ్యవహారం అప్పట్లో తెగ హల్చల్ చేసింది.
ఇక తాజాగా ఈ వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే పూనమ్ కౌర్.. రోజా పవన్ పై చేసిన గుండు కామెంట్స్ వీడియోకు లైక్ కొట్టింది. ఇది ప్రస్తుతం అటు టాలీవుడ్, ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది.
దీనిని బట్టీ పూనమ్ కౌర్.. పగన్ కళ్యాణ్‌పై రగిలిపోతున్నట్టే కనిపిస్తోందని కొందరు అంటున్నారు. మరి పవన్ పై అంత కోపం ఎందుకో పూనమ్ కౌర్ బయట పెట్టే వరకు ఎవరికీ తెలియదనే చెప్పాలి.