తెలుగు పాటలకు పెద్దదిక్కుగా... భారతదేశం గర్వించదగ్గ మహోన్నత గాయకుడిగా... ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఆయన పాట పంచామృతం... ఆయన స్వరంలో సప్తస్వరాలు రాగాలై నర్తిస్తూ  ఉంటాయి... గానగంధర్వుడి గా  ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గొంతులో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఆయన పాట వస్తుందంటే చాలు ఎవరైనా సరే సైలెంట్ గా వినాల్సింది. అంత గొప్పది గానం ఆయన సొంతం. ఎలాంటి వైవిధ్యమైన పాట నైనా సరే అలవోకగా ఆయనకు గలం  నుంచి జాలువారుతు  ఉంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు సంగీతానికి సరికొత్త రూపం కల్పించిన మహోన్నత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కొత్తలో.. చిన్న చిన్న హీరోల సినిమాలకు  మాత్రమే పాటలు పాడే అవకాశం దక్కింది. 

 


 అప్పట్లో స్టార్ హీరోల సినిమాలను అన్నింటికీ  ఘంటసాల మాత్రమే మ్యూజిక్ అందించేవారు. ప్రేక్షకులు కూడా ఘంటసాల గానాన్నే  కోరుకునేవారు. ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఎట్టకేలకు తన ప్రతిభతో ఘంటసాలతో కలసి పాడేందుకు అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరగాలి అంటూ ఏకవీర లో ఘంటసాలతో గా బాలు కూడా గొంతు కలిపారు. ఇక అప్పటి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరు మారు మోగిపోయింది. ఇక ఘంటసాల పరమపదించిన తర్వాత తెలుగు పాటలకు  పెద్దదిక్కుగా మారిపోయారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. తన పాటలో తెలుగు తనంతో   ఇప్పటికి ప్రేక్షకులను అలరిస్తున్నారు. 

 

 

 ఎలాంటి పాటలో నైనా తెలుగుదనం ఉట్టిపడేలా పాడుతూ తెలుగు ప్రేక్షకులను మైమరపించి చేస్తూనే ఉన్నారు. ఏ హీరో సినిమాలో అయినా ఆ  హీరో గొంతుకు తగ్గట్టుగా మ్యానరిజం కు  తగ్గట్లుగా పాటలు పాడడంలో ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి. అందుకే అటు సినిమా దర్శకులు కూడా తమ సినిమాలో ఎస్పి బాలసుబ్రమణ్యం తో  పాటలు పాడించుకొవటానికి  ఎక్కువగా ఇష్టపడేవారు. ఆ పాటలు వస్తున్నప్పుడు నిజంగానే హీరోల పాటలు పాడారేమో అనెంతగా ప్రభావితం చేసేవి పాటలు. ఇక ఆ స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఆయన ఏ పాట పాడిన అందులో తెలుగుదనం మాధుర్యం ఉట్టిపడుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: