తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు ఉన్న విషయం తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి పాకులాడుతూ ఉంటే కొంతమంది మాత్రం వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగేస్తూ ఉంటారు. హీరోయిన్ ఎవరైనా ఆ హీరోయిన్ పేరు చెప్పగానే ప్రేక్షకుల మదిలో ఏదో ఒక సన్నివేశం మెదులుతూ ఉంటుంది. ముఖ్యంగా చాలా మటుకు అయితే ఒక హీరోయిన్ పేరు చెప్పగానే ప్రేక్షకుల మదిలో ఏదో ఒక పాట ఉంటుంది. ఇలా క్యాథరిన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే పాట యూ ఆర్ మై ఎమ్మెల్యే. ఈ ఒక్క పాట క్యాథరిన్ కెరీర్లోనే తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేసింది. క్యాథరిన్ ఎన్నో సంవత్సరాలనుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

 


 స్టార్  హీరోల సినిమాలతో పాటు... యువ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది క్యాథరిన్ . అయితే అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతుంది  అని అనుకున్నప్పటికీ కి ఈ హీరోయిన్ కి అంతగా అదృష్టం మాత్రం కలిసి రాలేదు. దీంతో ప్రస్తుతం అడపాదడపా అవకాశాలు మాత్రమే అందుకుంటుంది క్యాథరిన్. అందంతో  ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. అయితే క్యాథరిన్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు అందరికి గుర్తొచ్చేది... సరైనోడు సినిమా లోని యువర్ మై ఎమ్మెల్యే పాట. సరైనోడు సినిమా లో ఒక ఎమ్మెల్యే పాత్రలో నటిస్తూ ఉంటుంది క్యాథరిన్ . 

 

 ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యాథరిన్ ని  లవ్ చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇక ఎమ్మెల్యే పాత్రలో నటించిన కేథరిన్ కి లవ్ ప్రపోజ్ చేస్తూ... యు ఆర్ మై ఎమ్మెల్యే అంటూ అల్లు అర్జున్ పాట తో తన లవ్ ను  ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. ఎమ్మెల్యే అంటే మై లవ్లీ ఏంజెల్ అని ఈ పాటలో  మీనింగ్ ఉంటుంది. ఇలా సాగి పోయిన ఈ పాట తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని రోజులపాటు ట్రెండింగ్ గా మారిపోయింది. అంతేకాకుండా ఈ ఒక్క పాట కొన్ని రోజుల పాటు ప్రేక్షకులు క్యాథరిన్ జపం చేసేలా చేసింది. ఇలా క్యాథరిన్ కెరియర్లో ఈ పాట తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: