పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అక్కడక్కడా ప్యాచ్ వర్క్ ఉందని తెలుస్తుంది. అసలైతే కరోనా లాక్ డౌన్ లేకపోతె మే నెలలోనే ఈ సినిమా రిలీజ్ అయ్యేది. ఇదిలాఉంటే సినిమా గురించి కొన్ని లీక్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఎక్సయిట్ చేస్తున్నాయి. 


సినిమాలో పవన్ లాయర్ గా కనిపిస్తాడని తెలిసిందే.. అంతేకాదు సినిమాలో కోర్ట్ రూమ్ సీన్స్ చాలా బాగుంటాయట.. ఆ సీన్స్ అన్ని బాగా వచ్చాయని అంటున్నారు. సినిమాలో డైలాగ్స్ కూడా బాగా వచ్చాయట. మామూలు డైలాగ్ ను పవన్ కళ్యాణ్ చెబితే ఎలా ఉంటుందో తెలుసు కదా.. సినిమాలో డైలాగ్స్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నారట. ఇక సినిమాలో మరో హైలెట్ థమన్ మ్యూజిక్ అవుతుందని అంటున్నారు. సాంగ్స్ తో పాటుగా సినిమాకు థమన్ బీజీఎమ్ కూడా బాగా ఇస్తున్నాడని తెలుస్తుంది. ఈ మూడు అంశాల హైలెట్ తో వకీల్ సాబ్ వస్తుందని టాక్. అదే జరిగితే పవర్ స్టార్ వకీల్ సాబ్ మళ్ళీ సెన్సేషనల్ హిట్ కొట్టినట్టే. 


మంచి కథను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్క్ కమర్షియల్ అంశాలను జోడించి ఈ సినిమా తీస్తున్నారని తెలుస్తుంది. సినిమా మాతృక నిర్మాత బోని కపూర్ కూడా ఈ సినిమాకు సహా నిర్మాతగా ఉంటున్నారు. మొత్తానికి వకీల్ సాబ్ నుండి వచ్చిన ఈ అప్డేట్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా చేస్తాయని చెప్పొచ్చు.             

 

మరింత సమాచారం తెలుసుకోండి: