ఉదయ్ కిరణ్ కెరీర్ లో వచ్చిన ది బెస్ట్ సినిమాల్లో ఒకటి మనసంతా నువ్వే. ఈ సినిమాలో ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులకు ఇంకా గుర్తుంది. ప్రతీ పాట కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. అదే విధంగా ఉదయ కిరణ్ లవర్ బాయ్ గా చాలా బాగా నటించాడు. ఇక ప్రేమ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోమాన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. హీరో హీరోయిన్ ల నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఉండే కొన్ని వాన సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి అని చెప్పవచ్చు. 

 

తన ప్రేమను చెప్పాలని వచ్చిన రేమా సేన్ కి ఉదయ్ కిరణ్ అబద్దాలు చెప్తాడు. దీనితో ఆమె బాగా హర్ట్ అవుతుంది. ఇక హీరో తర్వాత ఫీల్ అవుతూ ఉండగా వర్షం పడటం అన్నీ కూడా చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆ సన్నివేశం హైలెట్. అయితే తనకు  ఆ తర్వాత వచ్చిన కొన్ని అవకాశాలను వాడుకోవడంలో ఉదయ కిరణ్ ఫెయిల్ అయ్యాడు అనేది చాలా మంది చెప్పే మాట. వచ్చిన ఏ అవకాశం కూడా అతను సరిగా నిలబెట్టుకోలేదు అని కొందరు అంటే కాదు కొన్ని కొన్ని అతని కెరీర్ ని బాగా ఇబ్బంది పెట్టాయి అని మరి కొందరు అంటారు. 

 

ఇక అతను ఆత్మహత్య చేసుకోవడం కూడా చాలా మందికి బాధగా అనిపించింది. మరి కొందరు మాత్రం అతని ఆత్మహత్యతో సంతృప్తి పడ్డారు అని చెప్తారు. ఏది ఎలా ఉన్నా సరే అతని కెరీర్ లో మాత్రం మొదట్లో చాలా మంచి సినిమాలు చేసి ఏ హీరోకి రాని గుర్తింపు తను తెచ్చుకున్నాడు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: