న్యాచురల్ స్టార్ నానీ కెరీర్ లో వచ్చిన ది బెస్ట్ సినిమాల్లో పిల్ల జమిందార్ కూడా ఒకటి. ఆ సినిమా నానీ ని స్టార్ హీరో ని చేసింది అనేది వాస్తవం. ముఖ్యంగా ఆ సినిమాలో ఉండే కామెడి సినిమాకే హైలెట్ గా నిలిచింది అనేది వాస్తవం. ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులను చాలా బాగా అలరించింది అనేది వాస్తవం. ప్రతీ సన్నివేశంలో కూడా నానీ చాలా బాగా అలరించాడు అనేది అందరికి తెలిసిందే. ఇక సినిమా కథ తో పాటుగా దర్శకుడు తీసుకొచ్చిన విధానం అన్నీ కూడా హైలేట్ అనే చెప్పవచ్చు. అది పక్కన పెడితే ఈ సినిమాలో ఒక మంచి వాన సన్నివేశం ఉంది. 

 

అలా ఇద్దరు పిల్లలు  నానీని కలిసి ఒకే గొడుగు కింద వెళ్తూ ఉంటారు. నానీ వాళ్ళ పాత ఇంటి ని చూడటం అన్నీ చిన్న నాటి జ్ఞాపకాలు అలా గుర్తుకి రావడం.. ఆ సీన్  తనలో చాలా మార్పు తీసుకొస్తుంది అన్న మాట. ఆ విధంగా ఆ సినిమాలో ఆ సీన్ చాలా హైలెట్ గా నిలిచింది. ఇక ఆ సీన్ లో పిల్లలు ఇద్దరూ కూడా చాలా బాగా నటిస్తారు. నానీ హావ భావాలకు కూడా మంచి మార్కులు వేసిన సన్నివేశం అది అని చెప్తారు. ఇక ఆ సినిమా తర్వాత నానీకి చాలా మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. వాటిని నిలబెట్టుకుని అతను కెరీర్ లో చాలా వరకు మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. 

 

ప్రస్తుతం నానీ చేస్తున్న మూడు సినిమాలు కూడా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. అవి ఎప్పుడు విడుదల అవుతాయి అనేది చెప్పడం కాస్త కష్టంగానే ఉంది ప్రస్తుతం. మరి ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చూడాలి. సినిమాల షూటింగ్ పూర్తి అయింది దాదాపుగా.

మరింత సమాచారం తెలుసుకోండి: