ఇప్పుడు హీరోయిన్ లు అవకాశాల కోసం ఏ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు అనేది అందరికి తెలిసిందే. అవకాశాలు వస్తే చాలు అనుకునే పరిస్థితి ఇప్పుడు తెలుగులో ఉంది. చాలా మంది హీరోయిన్ లు అన్నీ ఉన్నా సరే ఆదరణ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇప్పుడు అవకాశాలు లేని హీరోయిన్ లు పరిస్థితి మరీ దిగజారి ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. మన తెలుగులో మాత్రం కొందరు నిర్మాతలు హీరోయిన్ లను బాగా ఇబ్బంది పెడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. వారిని ఆదుకునే పరిస్థితి కూడా కొందరు నిర్మాతల వద్ద లేదు. 

 

ఆదుకోవడం ఏంటీ అంటారా...? ఒకప్పుడు అవకాశాలు ఇస్తామని తర్వాత వాళ్ళను వద్దు అని కొందరు నిర్మాతలు బాగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి మన తెలుగులో. ఇప్పుడు కనీసం ఆదుకోవడం లేదు అనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక తాజాగా ఒక హీరోయిన్ అయితే ఆత్మహత్యకు కూడా ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె ఎందుకు ఆ విధంగా చేసింది అనేది తెలియదు గాని ఆమెకు మాత్రం ఆర్ధిక ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్నాయి అని ఆమెను ఆదుకునే వారు ఎవరూ లేరు అని ఆమె వాపోయినట్టు తెలుస్తుంది. 

 

ఇక ఒక నిర్మాత అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ వెనక్కు అడుగుతున్నారు అని తాను ఎక్కడి నుంచి తీసుకుని రావాలి అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విధానం మంచిది కాదని నిర్మాత గురించి ఇప్పుడు కొందరికి ఫిర్యాదు చేయడానికి గానూ హీరోయిన్ సిద్దమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజం ఎంత అనేది తెలియదు గాని దీనిపై మాత్రం ఇప్పుడు పెద్ద చర్చ టాలీవుడ్ లో జరుగుతుంది. హీరోయిన్ ఎవరు నిర్మాత ఎవరు అనేది తెలియడం  లేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: