వైరస్ వల్ల లాక్ డౌన్ దెబ్బకి సినిమా థియేటర్ ల వ్యాపారం ప్రశ్నార్థకంగా మారింది. ఒక పక్క సినిమా షూటింగులకు అనుమతులు వచ్చినా గానీ సినిమా థియేటర్ల విషయంలో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడానికి తెగ ఆలోచిస్తున్నాయి. ఇటీవల కేంద్రమంత్రి జవదేకర్ మాట్లాడుతూ ఇప్పుడప్పుడే సినిమా థియేటర్ ల గురించి ఆలోచించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడం జరిగింది. మరోపక్క సినిమా నిర్మించిన నిర్మాతలు OTT ల వైపు చూస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం చూస్తే గుంపులుగుంపులుగా ఉండేచోట కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉండటం. దీంతో సినిమా థియేటర్ ల వ్యాపారం పూర్తి ఇబ్బందుల్లో పడిపోయింది.

IHG

ఈ తరుణంలో సినిమా థియేటర్ల యాజమాన్యాలు భవిష్యత్తులో సినిమా ధియేటర్ ఏవిధంగా ఈ వైరస్ ఎదుర్కోవాలి, ఏ విధంగా ప్రేక్షకుడు సినిమా థియేటర్ కి వచ్చి సురక్షితంగా ఇంటికి వెళ్లాలి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎలా వ్యవహరించాలి అన్న దాని గురించి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు ఇచ్చిన ఐడియా విని ఇది బెస్ట్ ఐడియా అని సినిమా థియేటర్ల యాజమాన్యాలు అంటున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో కరోనా వైరస్ ప్రభావం తగ్గింది అని ఒకేసారి అక్కడ ఉన్న సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఓపెన్ చేశారు.

IHG

ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల సినిమా థియేటర్ క్లోజ్ చేసెశారు. అటువంటి పరిస్థితి మన దగ్గర రాకుండా ఉండాలంటే రెండు నెలలపాటు థియేటర్ల ఓపెన్ విషయంలో మాట్లాడకుండా ఉంటే బెటర్ అని తన అభిప్రాయాన్ని సురేష్ బాబు వ్యక్తం చేశారు. ఈ విధంగా వ్యవహరించడం వల్ల ఒక ఐడియా వస్తుందని ఇతర రాష్ట్రాలలో థియేటర్ లో ఓపెన్ అయిన పరిస్థితి... మనకి ఇక్కడ తెలుస్తోందని వ్యాఖ్యానించినటు సమాచారం. మరోపక్క కొంతమంది థియేటర్ యాజమాన్యాలు సురేష్ బాబు ఐడియా ది బెస్ట్ ఐడియా అని సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో సినిమా ప్రముఖుల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: