విజయశాంతి... ఈ తరానికి పెద్దగా పరిచయం లేని పేరు. హీరోయిన్ అంటే హీరో పక్కన మాత్రమే నటించేది కాదు అని చెప్పిన హీరోయిన్. అగ్ర హీరో అయినా చిన్న హీరో అయినా సరే హీరోయిన్ కి ఒక గుర్తింపు ఉండాలి అని చెప్పిన హీరోయిన్. ఏ సినిమా చేసినా సరే తనకంటూ ఒక మార్క్ ఉండాలి అనే విధంగా నటించిన హీరోయిన్. ఇప్పటి హీరోయిన్ లకు చాలా మందికి సోలో గా సినిమాలు చెయ్యాలి అంటే భయం. హీరో పక్కన లేకపోతే తమకు గుర్తింపు రాదు అనే భాద ఉంటుంది. ఆమె మాత్రం అప్పట్లో నటనకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. 

 

ఆమె చేసిన సినిమాలు ఆమె నటన ఈ తరానికి తెలియకపోవచ్చు గాని తెలుగులో శ్రీదేవి తర్వాత లేడీ సూపర్ స్టార్ అనే విధంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఆమె అనేది వాస్తవం. ఇప్పుడు ఆమె పెద్దగా సినిమాల్లో కనపడటం లేదు. చిరంజీవి సినిమా అయినా కృష్ణ సినిమా ఆయినా బాలకృష్ణ సినిమా అయినా వెంకటేష్ సినిమా అయినా సరే ఆమె లేకపోతే సినిమాకు ఒక రేంజ్ ఉండదు అనే విధంగా ఆమె నటించింది. అప్పుడు అవకాశాలు రావాలి అంటే అందం చూపించాలి. అయినా సరే ఆమె ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూపించింది అని చెప్పవచ్చు. 

 

ఏ పాత్రలో నటించినా సరే ఆమె చాలా హుందాగా నటించింది అనే మాట అక్షరాలా నిజం. ఆమె పాత్రలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆమె నటనకు కూడా మంచి మార్కులు వేసాయి అని చెప్పవచ్చు. ఆమె ప్రస్తుతం ఒక నాలుగు  తెలుగు సినిమాల్లో కనపడే ప్రయత్నం చేస్తుంది. మరి ఏ సినిమాలో ఆమె కనపడుతుంది అనేది చూడాలి.  ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలో  కనపడిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: